
- మలేసియా ప్రధాని సంచలన కామెంట్
- మోడీని కలిసిన పక్షం రోజుల తర్వాత మాటమార్చిన మహతిర్
కౌలాలంపూర్: వివాదాస్పద మత గురువు జకీర్ నాయక్ ను తమ కస్టడీకి అప్పగించాలని ప్రధాని నరేంద్రమోడీ అడగలేదని మలేసియా పీఎం మహతిర్ మహమ్మద్ చెప్పారు. మోడీని కలిసినప్పుడు ఆయన నాయక్ గురించి అడగలేదని మహతిర్ స్థానిక మీడియాకు చెప్పారు. నాయక్‌ను దేశం నుంచి పంపించడానికి సేఫ్ అయిన చోటును చూస్తున్నామని తెలిపారు.
హిందూ మలేసియన్లు ప్రధాని మోడీకి నమ్మకంగా ఉంటున్నారని ఈ మధ్య మత గురువు కాంట్రవర్షియల్ కామెంట్స్ చేశారు. నాయక్‌ను ఇతర దేశాలకు పంపించాలని అనుకుంటున్నా..ఆయనను ఆహ్వానించడానికి ఏదేశమూ ఇష్టపడడంలేదని ప్రధాని చెప్పారు. రష్యాలో 15 రోజుల క్రితం జరిగిన ఈస్టర్ ఎకనామిక్ ఫోరమ్ మీటింగ్‌లో మోడీ, మహతిర్ ఇద్దరూ కలుసుకున్నారు. నాయక్‌ను తమ దేశానికి అప్పగించాలని మహతిర్‌ను ప్రధాని మోడీ కోరిన విషయాన్ని ఫారెన్ సెక్రటరీ విజయ్ గోఖలే అప్పట్లో మీడియాకు కూడా చెప్పారు. విదేశాంగ మంత్రి జైశంకర్ కూడా మంగళవారం నాటి మీడియా సమాశంలో విజయ్ గోఖలే వివరణ నిజమేనని చెప్పారు. ఇన్నాళ్ల తర్వాత మహతిర్ నాయక్ అంశంపై ఇలాంటి స్టేట్‌మెంట్ ఇవ్వడం కలకలం సృష్టిస్తోంది.
- 53 ఏళ్ల నాయక్ ఇస్లామిక్ రాడికల్ మత బోధకుడు.
- 2016లో ఇండియాను విడిచిపెట్టాడు
- మలేసియా పౌరసత్వం తీసుకున్నాడు.
- మనీలాండరింగ్, రెచ్చగొట్టే ప్రసంగాలపై ఆయనపై మనదేశంలో కేసులున్నాయి.
- ఢాకాలోని హోలో ఆర్టిజాన్ బేకరీ దగ్గర 2016 జులైలో జరిగిన టెర్రర్ ఎటాక్ కేసులో బంగ్లాదేశ్ సర్కార్ ఆయనపై కేసు పెట్టింది.
- మలేసియా సర్కార్ పబ్లిక్ స్పీచ్‌లు ఇవ్వొద్దని జకీర్‌ని ఆదేశించింది.