అమెరికాకు తగ్గుతున్న ఎగుమతులు.. పడిపోతున్న స్మార్ట్‌‌‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌‌‌ఫోన్ అమ్మకాలు

అమెరికాకు తగ్గుతున్న ఎగుమతులు.. పడిపోతున్న స్మార్ట్‌‌‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌‌‌ఫోన్ అమ్మకాలు
  • టారిఫ్ల ఎఫెక్టే కారణం విచారణ జరపాలి: జీటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐ

న్యూఢిల్లీ: భారతదేశం నుంచి అమెరికాకు స్మార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోన్లు సహా చాలా రకాల ఎగుమతులు గణనీయంగా తగ్గాయి. ఈ ఏడాది మే నెలలో 2.29 బిలియన్ డాలర్లు ఉన్న ఎగుమతులు, ఆగస్టులో 964.8 మిలియన్ డాలర్లకు పడిపోయాయని థింక్ ట్యాంక్ గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ (జీటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐ) సోమవారం తెలిపింది. ఈ తగ్గుదల ఆందోళన కలిగిస్తోందని, దీనికి గల కారణాలను తెలుసుకోవడానికి అత్యవసరంగా విచారణ జరిపించాలని జీటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐ ప్రభుత్వానికి సూచించింది. స్మార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోన్లపై ఎలాంటి సుంకాలూ లేనప్పటికీ ఈ తగ్గుదల కనిపించడం ఆశ్చర్యకరమని పేర్కొంది. ఈ ఏడాది మేలో 2.29 బిలియన్ డాలర్లుగా ఉన్న స్మార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోన్ ఎగుమతులు, జూన్‌‌‌‌లో 2 బిలియన్ డాలర్లకు, జులైలో 1.52 బిలియన్ డాలర్లకు, ఆగస్టులో 964.8 మిలియన్ డాలర్లకు తగ్గాయి.

2025 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ స్మార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోన్ల ఎగుమతులలో మొదటిస్థానంలో అమెరికా నిలిచింది. మొత్తం 24.1 బిలియన్ డాలర్ల విలువైన స్మార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోన్ ఎగుమతుల్లో 10.6 బిలియన్ డాలర్ల విలువైన యూనిట్లు అమెరికాకు వెళ్లాయి. దీని తర్వాత 7.1 బిలియన్ డాలర్లతో యూరోపియన్​ యూనియన్​ ఉంది. మనదేశం నుంచి అమెరికాకు ఎగుమతులు వరుసగా మూడో నెలలోనూ తగ్గాయని జీటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐ ఫౌండర్​ అజయ్ శ్రీవాస్తవ తెలిపారు. గత నెల 28 తర్వాత 50 శాతం సుంకం విధించారని, సెప్టెంబర్ నెలలో ఈ సుంకాల ప్రభావం మరింత స్పష్టంగా కనిపిస్తుందని ఆయన పేర్కొన్నారు.

ఇతర ఎగుమతులు ఇలా..
స్మార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోన్లే కాకుండా సుంకం లేని ఇతర ఉత్పత్తుల ఎగుమతులు కూడా తగ్గాయి. ఆగస్టు నెలలో భారతదేశం నుంచి సుంకం లేని ఉత్పత్తుల ఎగుమతులు 41.9 శాతం పడిపోయాయి. మే నెలలో 3.37 బిలియన్ డాలర్ల నుంచి ఆగస్టులో 1.96 బిలియన్ డాలర్లకు పడిపోయాయి. ఫార్మా  ఎగుమతులు మే నెలలో 745 మిలియన్ డాలర్ల నుంచి ఆగస్టులో 646.6 మిలియన్ డాలర్లకు అంటే 13.3 శాతం తగ్గాయి. నగల ఎగుమతులు 9.1 శాతం తగ్గి ఆగస్టులో 228.2 మిలియన్ డాలర్లకు చేరాయి. ఇందులో వజ్రాలు పొదిగిన బంగారు నగలు, పాలిష్ చేసిన వజ్రాల ఎగుమతులు కూడా ప్రతికూల వృద్ధిని నమోదు చేశాయి.

మే నెలలో 289.7 మిలియన్ డాలర్లు ఉన్న  సముద్రపు ఆహార ఎగుమతులు ఆగస్టులో 162.7 మిలియన్ డాలర్లకు.. అంటే 43.8 శాతం తగ్గాయి. వస్త్రాలు, దుస్తుల ఎగుమతులు మే నెలలో 943.7 మిలియన్ డాలర్ల నుంచి ఆగస్టులో 855.5 మిలియన్ డాలర్లకు.. అంటే 9.3 శాతం తగ్గాయి. రసాయనాల ఎగుమతులు కూడా మే నుంచి ఆగస్టు మధ్య 15.9 శాతం తగ్గి 451.9 మిలియన్ డాలర్లకు చేరాయని జీటీఆర్​ఐ పేర్కొంది.