IND vs NZ : గిల్ డబుల్ సెంచరీ.. టీమిండియా భారీ స్కోర్

IND vs NZ : గిల్ డబుల్ సెంచరీ.. టీమిండియా భారీ స్కోర్

హైదరాబాద్ వేదికగా ఉప్పల్ స్టేడియంలో  కివీస్ తో జరుగుతోన్న తొలి వన్డే మ్యాచ్ లో టీమిండియా భారీ స్కోర్  చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన టీమిండియా నిర్ణిత 50  ఓవర్లలో 8  వికెట్ల నష్టానికి 349 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ లో  ఓపెనర్  శుభ్‌మన్‌ గిల్(208) చెలరేగాడు. ఓపెనర్ గా క్రీజ్ లోకి వచ్చిన గిల్..  చివరి వరకు క్రీజ్లో ఉండి డబుల్ సెంచరీ బాదాడు. 145 బంతుల్లో గిల్ డబుల్ సెంచరీ సాధించిన గిల్  డబుల్ సెంచరీకి ముందు మూడు సిక్సర్లు బాదాడు. గిల్ ఇన్నింగ్స్ లో మొత్తం19 ఫోర్లు, 9 సిక్స్‌లున్నాయి. ఇక  రోహిత్ శర్మ (34), సూర్యకుమార్ (31), పాండ్య(28) రన్స్ చేశారు.