మన బంధం వేల ఏళ్ల నాటిది

మన బంధం వేల ఏళ్ల నాటిది

న్యూఢిల్లీ: పొరుగు దేశానికి సాయం అందించాలనే విధానంలో భాగంగా శ్రీలంకకు భారత్ ఎప్పుడూ అధిక ప్రాధాన్యత ఇచ్చిందని ప్రధాని మోడీ అన్నారు. సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ది రీజియన్ (సాగర్)లో భాగంగా లంకకు ఆపన్న హస్తం అందిస్తూ వచ్చామన్నారు. శనివారం వర్చువల్ బైల్యాటెరల్ సమ్మిట్‌‌‌లో శ్రీలంక ప్రధాని మహింద రాజపక్షతో మోడీ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య సంబంధాలపై ఇద్దరు ప్రధానులు చర్చించారు. లంకతో భారత్ బంధం వేల ఏళ్లుగా కొనసాగుతోందని మోడీ చెప్పారు. మరోమారు ప్రధానిగా ఎన్నికైనందుకు రాజపక్షకు మోడీ శుభాకాంక్షలు తెలిపారు. ఇరు దేశాల బంధాల్లో భాగంగా బుద్ధిజంను ప్రమోట్ చేయడానికి లంకకు 15 మిలియన్ల సాయాన్ని అందించనున్నామని మోడీ పేర్కొన్నారు. శ్రీలంక నుంచి ఉత్తర్ ప్రదేశ్‌‌లోని కుషినగర్‌‌కు వచ్చి సందర్శించేందుకు లంకన్ బుద్ధిస్ట్ యాత్రికులకు భారత్ సదుపాయం కల్పిస్తుందన్నారు. దీన్ని మహింద రాజపక్ష స్వాగతించారు. కరోనా సమయంలో ఇతర దేశాల కోసం భారత్ చాలా సాయం అందించిందని రాజపక్ష చెప్పారు.