న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సినేషన్‌లో ఇండియా రికార్డు సృష్టించింది. మంగళవారం ఒక్కరోజే కోటీ 30 లక్షల మందికి పైగా టీకాలు వేశారు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా కేంద్ర మంత్రి మన్‌సుఖ్ మాండవీయ వెల్లడించారు. ఈ నెల 27న కోటీ 8 లక్షల మందికి పైగా టీకాలు పంపిణీ చేసిన ఇండియా.. ఐదు రోజుల్లోనే ఆ రికార్డును బ్రేక్ చేసింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 65 కోట్ల మందికి పైగా టీకాలేసినట్టు కేంద్రం వెల్లడించింది. ఇందులో 50,25,16,979 మందికి ఫస్ట్ డోసు.. 14,93,41,343 మందికి రెండు డోసులు పూర్తయ్యాయి.
