
- అమెరికా విదేశాంగ మంత్రికి ఫోన్లో చెప్పిన జైశంకర్
న్యూ ఢిల్లీ: పహల్గాం దాడికి ప్రతీకారంగా పాకిస్తాన్లోని ఉగ్రస్థావరాలపై తాము దాడి చేస్తామని ‘ఆపరేషన్ సిందూర్’ చేపట్టే వారం ముందే అమెరికాకు భారత్ తెలిపింది. ఈ విషయాన్ని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ ఫోన్లో తెలియజేశారు.
మేం పాకిస్తాన్లోని టెర్రరిస్టులను నాశనం చేస్తాం. ఇందులో సందేహమే లేదు” అని రూబియోతో జైశంకర్ పేర్కొన్నట్టు మీడియా వర్గాలు తెలిపాయి. కాగా, ఈ నెల 7న భారత్ ‘ఆపరేషన్ సిందూర్’ను చేపట్టింది. పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని 9 టెర్రరిస్ట్ స్థావరాలను ధ్వంసం చేసింది.