ఇండియా మాకు విలువైన స్నేహితుడు: ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు వ్యాఖ్య

ఇండియా మాకు విలువైన స్నేహితుడు: ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు వ్యాఖ్య
  • 5 రోజుల పర్యటనలో భాగంగా ఢిల్లీ చేరుకున్న ఫెర్డినాండ్ మార్కోస్

న్యూఢిల్లీ: ఇండియా తమకు విలువైన స్నేహితుడని ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు ఫెర్డినాండ్ మార్కోస్ జూనియర్ అన్నారు. ఇండియా, ఫిలిప్పీన్స్ మధ్య 1949లో స్థాపితమైన ద్వైపాక్షిక సంబంధాలు..75 ఏండ్లుగా కొనసాగుతున్నాయని తెలిపారు. 5 రోజుల పర్యటనలో భాగంగా  ఫెర్డినాండ్ మార్కోస్.. సోమవారం ఢిల్లీలోని పాలం ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌‌‌‌కు చేరుకున్నారు. అయితే, ఇండియా బయలుదేరేముందు ఆయన మనీలాలో మీడియాతో మాట్లాడారు.

‘‘ఇండియా మాకు విలువైన స్నేహితుడు. ఈ టూర్ రెండు దేశాల మధ్య 75 ఏండ్ల దౌత్య సంబంధాల సందర్భంగా జరుగుతున్నది. ఇన్నేండ్ల మా ద్వైపాక్షిక సంబంధాలు సమగ్రమైన అభివృద్ధిని సాధించాయి. రక్షణ, వాణిజ్యం, ఆరోగ్యం, ఫార్మాస్యూటికల్స్, వ్యవసాయం, టూరిజం, డిజిటల్ కనెక్టివిటీ రంగాల్లో సహకారం ద్వారా రెండు దేశాలకు ప్రయోజనం చేకూరుతున్నది. కాగా.. మార్కోస్ ప్రధాని మోదీని కలుస్తారు. ఇరుదేశాల మధ్య ఆర్థిక, రక్షణ, భద్రత, రాజకీయ విషయాలతో పాటు వాణిజ్యం, పెట్టుబడి వంటి రంగాల్లో సహకారంపై చర్చిస్తారు.