ఎఫ్‌‌‌‌ఐహెచ్‌‌‌‌ హాకీ వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌లో ఇండియాకు చెక్

 ఎఫ్‌‌‌‌ఐహెచ్‌‌‌‌ హాకీ వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌లో ఇండియాకు చెక్

ఆమ్‌‌‌‌స్టెల్విన్‌‌‌‌: ఎఫ్‌‌‌‌ఐహెచ్‌‌‌‌ హాకీ వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌లో ఇండియా మెన్స్‌‌‌‌ జట్టు నిరాశపర్చింది. శనివారం జరిగిన  కీలకమైన రెండో రౌండ్‌‌‌‌ రౌండ్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌లో ఇండియా 1–3తో డిఫెండింగ్‌‌‌‌ ఒలింపిక్‌‌‌‌ చాంపియన్ నెదర్లాండ్స్‌‌‌‌ చేతిలో ఓడింది. దాంతో సెమీస్‌‌‌‌ రేసు నుంచి నిష్క్రమించింది. ఇండియా తరఫున కెప్టెన్‌‌‌‌ హర్మన్‌‌‌‌ప్రీత్‌‌‌‌ సింగ్‌‌‌‌ (52వ ని) ఏకైక గోల్‌‌‌‌ చేయగా, డ్యుకో టెల్జెన్‌‌‌‌కాంప్‌‌‌‌ (41వ ని), తెప్‌‌‌‌ హోడెమాకర్స్‌‌‌‌ (51వ ని), థిజ్‌‌‌‌ వాన్‌‌‌‌డామ్‌‌‌‌ (55వ ని) నెదర్లాండ్స్‌‌‌‌కు మూడు ఫీల్డ్‌‌‌‌ గోల్స్‌‌‌‌ అందించారు. మ్యాచ్‌‌‌‌ ప్రారంభం నుంచి ఇరుజట్లు గోల్స్‌‌‌‌ కోసం తీవ్రంగా శ్రమించాయి. 

తొలి రెండు క్వార్టర్స్‌‌‌‌లో డచ్‌‌‌‌ ఎదురుదాడులను ఇండియా డిఫెన్స్‌‌‌‌ సమర్థవంతంగా అడ్డుకుంది. గోల్‌‌‌‌ కీపర్‌‌‌‌ మోహిత్‌‌‌‌ అద్భుతమైన సేవ్‌‌‌‌లతో ఆకట్టుకున్నాడు. మూడో క్వార్టర్స్‌‌‌‌లో మోస్తరుగా ఆడిన ఇండియా చివరి క్వార్టర్‌‌‌‌లో ఘోరంగా తేలిపోయింది. సోమవారం జరిగే ఆఖరి మ్యాచ్‌‌‌‌లో ఇండియా.. అర్జెంటీనాతో తలపడుతుంది.