పాకిస్తాన్ కు చెక్.. చినాబ్ నదిపై భారీ ప్రాజెక్టు .. టెండర్ల ప్రక్రియ ప్రారంభించిన కేంద్రం

పాకిస్తాన్ కు చెక్.. చినాబ్ నదిపై భారీ ప్రాజెక్టు .. టెండర్ల ప్రక్రియ ప్రారంభించిన కేంద్రం

శ్రీనగర్: జమ్మూకాశ్మీర్ లోని చినాబ్ నదిపై భారీ జల విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణానికి ఇండియా సిద్ధం అవుతోంది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ తో సింధూ జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకున్న కేంద్రం సింధూ జలాలు పాక్ కు వెళ్లకుండా చూసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇందులో భాగంగా చినాబ్ నదిపై1,856 మెగావాట్ల జల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంతో భారీ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందించింది. సింధూ జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకున్నందున ఈ ప్రాజెక్టుకు పాక్ అనుమతి అవసరం కూడా తప్పిపోయింది. 

ఈ నేపథ్యంలో జమ్మూకాశ్మీర్ లోని సావల్ కోట్ వద్ద ఈ ప్రాజెక్టును చేపట్టడం కోసం తాజాగా నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ టెండర్ ప్రక్రియ మొదలు పెట్టింది. రూ.22,704 కోట్ల వ్యయంతో రెండు దశల్లో దీనిని నిర్మించనున్నారు. నిజానికి 1980వ దశకంలోనే నిర్మించాల్సిన ఈ ప్రాజెక్టు పాకిస్తాన్ అభ్యంతరంతో 40 ఏండ్లుగా పెండింగ్ లో ఉండిపోయింది. తాజాగా మారిన పరిస్థితుల నేపథ్యంలో పాక్ కు చెక్ పెట్టేలా కేంద్రం ఈ ప్రాజెక్టుపై దృష్టి సారించింది.