దేశంలోని 244 జిల్లాల్లో ఇయ్యాల ఆపరేషన్ అభ్యాస్

దేశంలోని 244 జిల్లాల్లో ఇయ్యాల ఆపరేషన్ అభ్యాస్
  • సివిల్ ​డిఫెన్స్​ మాక్​ డ్రిల్ ​నిర్వహించనున్న అధికారులు
  • ఏర్పాట్లను పర్యవేక్షించిన హోంశాఖ కార్యదర్శి గోవింద్​మోహన్
  • శ్రీనగర్​లోని దాల్​ లేక్​లో మాక్ డ్రిల్ నిర్వహించిన ఎస్డీఆర్​ఎఫ్​ 
  • జాతీయ భద్రతా సలహాదారు దోవల్​తో ప్రధాని మోదీ భేటీ
  • దేశంలో ప్రస్తుత భద్రతా పరిస్థితిపై చర్చ
  • సికింద్రాబాద్, గోల్కొండ,డీఆర్‌‌డీవో, మౌలాలిలో మాక్​ డ్రిల్

న్యూఢిల్లీ: పహల్గాం దాడి వెనుక పాకిస్తాన్​ ఉందని అనుమానిస్తున్న భారత్.. ఆ దేశానికి గట్టిగా బదులిచ్చేందుకు అడుగులు వేస్తున్నది. ఇందులో భాగంగా జాతీయ భద్రతా సలహాదారు అజిత్​ దోవల్​తో  ప్రధాని మోదీ మంగళవారం మరోసారి భేటీ అయ్యారు. కేంద్ర హోంశాఖ కీలక సమావేశం నిర్వహించింది. అత్యవసర సమయాల్లో  ఎలా వ్యవహవరించాలి అనేదానిపై దేశ ప్రజలను సమాయత్తం చేసేందుకు బుధవారం ‘ఆపరేషన్​ అభ్యాస్’ పేరుతో సివిల్​ డిఫెన్స్​ మాక్ ​డ్రిల్​ నిర్వహించాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సోమవారం ఆదేశాలిచ్చింది. 

ఈ నేపథ్యంలో మాక్​ డ్రిల్ నిర్వహణపై ఆ శాఖ కార్యదర్శి  గోవింద్ మోహన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆధ్వర్యంలో మంగళవారం కీలక మీటింగ్​ జరిగింది. ఇందులో సివిల్ డిఫెన్స్, ఎన్డీఆర్ఎఫ్ డీజీలు, ఎన్డీఎంఏ అధికారులు పాల్గొన్నారు. సీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లతో గోవింద్ మోహన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వీడియా కాన్ఫరెన్స్ నిర్వహించారు. మాక్ డ్రిల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు దిశానిర్దేశం చేశారు. శత్రువులు దాడి చేస్తే మనకు మనం ఎలా కాపాడుకోవాలి? ఈ సమయంలో విద్యార్థులు, యువకులు ఎలా ప్రతిస్పందించాలనే దానిపై అవగాహన కల్పించాలని సూచించారు.

మాక్ ​డ్రిల్​కు సిద్ధం

కేంద్రం ఆదేశాల మేరకు మాక్​డ్రిల్​ నిర్వహించేందుకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు సిద్ధమయ్యాయి. 1971 తర్వాత ఆ స్థాయిలో మళ్లీ నేడు దేశవ్యాప్తంగా తొలిసారి మాక్​డ్రిల్​ జరగనున్నది.  హోం మంత్రిత్వ శాఖ ప్రకారం.. దేశంలోని 244 జిల్లాల్లో ఈ డ్రిల్​ నిర్వహిస్తారు. జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, బెంగాల్, ఈశాన్య రాష్ట్రాల్లోని జిల్లాలు ఇందులో ప్రధానంగా ఉన్నాయి.  తెలుగు రాష్ట్రాల నుంచి హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, విశాఖపట్నాన్ని మాక్​డ్రిల్​కోసం ఎంపిక చేశారు. 

ఇందులో అధికారులతోపాటు సివిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డిఫెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వార్డెన్లు, వలంటీర్లు, హోంగార్డులు, ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీసీ, ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్, నెహ్రూ యువకేంద్రాలు (ఎన్​వైకేఎస్), కళాశాలలు, పాఠశాలల విద్యార్థులను  భాగస్వాముల్ని చేయనున్నారు. ఈ డ్రిల్​ను గ్రామస్థాయి వరకు నిర్వహించాలని కేంద్రం హోం శాఖ ప్లాన్ చేసింది. ఏదైనా ఎమర్జెన్సీ పరిస్థితులు తలెత్తినప్పుడు ప్రజలు, అధికారులు ఎలా వ్యవహరించాలనేదానిపై అవగాహన కల్పించడమే 
లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.   

దాల్​ సరస్సులో మాక్​ డ్రిల్​

కేంద్రం ఆదేశాల మేరకు జమ్మూకాశ్మీర్​లోని దాల్​ సరస్సులో ఎస్డీఆర్ఎఫ్​ బృందం మంగళవారం మాక్​డ్రిల్​ నిర్వహించింది. పడవ బోల్తాపడ్డప్పడు ఎలా వ్యవహరించాలనే దానిపై కసరత్తు చేసింది.  పర్యాటకులు లేదా స్థానికులు ఉన్న పడవ ప్రమాదంలో చిక్కుకున్నప్పుడు రెస్క్యూ ఆపరేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎలా చేయాలనేది ప్రాక్టీస్ చేశారు. ప్రకృతి వైపరీత్యాలేకాదు.. అత్యవసర పరిస్థితులలాంటి ఏ సవాళ్లు ఎదురైనా తాము సిద్ధమని ప్రదర్శన ద్వారా వెల్లడించారు.

మాక్​ డ్రిల్ చేసేదిలా..

  • ఈ మాక్​ డ్రిల్​ను యుద్ధం లేదా ఎయిర్​స్ట్రైక్స్​లాంటి  అత్యవసర పరిస్థితుల్లో పౌరులను సన్నద్ధం చేయడానికి, భద్రత, సమన్వయం, అవగాహన పెంచడంకోసం నిర్వహిస్తారు. శత్రుదేశపు ఫైటర్​ జెట్లు, మిసైల్స్​, డ్రోన్లు దూసుకొస్తే ఏం చేయాలనేదానిపై ప్రజలకు శిక్షణ ఇస్తారు. ఇందులో సైరన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అత్యంత కీలకమైంది. 
  • ఈ డ్రిల్​తో గగనతల దాడులు జరిగినప్పుడు  ప్రజలను అప్రమత్తం చేయడంలో  సైరన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు ఎంత ప్రభావవంతంగా ఉన్నాయో అంచనా వేస్తారు.
  • వైమానిక దాడి జరిగినప్పుడు వేగంగా, సురక్షితంగా స్పందించడానికి శిక్షణ ఇస్తారు.
  • సివిల్ అధికారులు, భారత వైమానిక దళం మధ్య హాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్, రేడియో కమ్యూనికేషన్​ను వినియోగంలోకి తెస్తారు.
  • అత్యవసర సమయంలో కంట్రోల్ రూమ్స్, షాడో రూమ్స్​ పని తీరును చెక్ చేస్తారు. 
  • శత్రు దాడుల సమయంలో సివిల్​ డిఫెన్స్​ టెక్నిక్స్​తో తమను తాము రక్షించుకునేలా విద్యార్థులు సహా ప్రజలందరికీ శిక్షణ ఇస్తారు. 
  • బ్లాకౌట్స్​ సమయంలో తీసుకోవాల్సిన చర్యలను నేర్పిస్తారు. ఎయిర్​రైడ్​ సమయంలో లైట్లు స్విచ్ఛాప్​ చేయాలని కోరుతారు. 
  • వైమానిక స్థావరాలు, రైలు యార్డులు, రిఫైనరీలు వంటి కీలకమైన మౌలిక సదుపాయాలను  దాడుల నుంచి రక్షించడానికి ప్రాక్టీస్​ చేస్తారు. 
  • రెస్క్యూ బృందాలు,  అగ్నిమాపక సిబ్బంది సంసిద్ధతను పరీక్షిస్తారు. ప్రమాద ప్రాంతాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు రిహార్సల్ చేస్తారు.
  • ఫస్ట్ ఎయిడ్, ఫైర్​ఫైటింగ్​ ఎక్విప్​మెంట్స్ నిర్వహణ, ఎమర్జెన్సీ సమయంలో షెల్టర్​లోకి వెళ్లడంలాంటి వాటిపై పౌరులకు ట్రెయినింగ్​ ఇస్తారు.