IND vs AUS: రేపు (అక్టోబర్ 25) సిడ్నీలో మూడో వన్డే.. ఇండియా, ఆస్ట్రేలియా తుది జట్లు ఇవే!

IND vs AUS: రేపు (అక్టోబర్ 25) సిడ్నీలో మూడో వన్డే.. ఇండియా, ఆస్ట్రేలియా తుది జట్లు ఇవే!

ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా మూడు వన్డే మ్యాచ్ ల సిరీస్ ను టీమిండియా కోల్పోయింది. ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే 0-2 తేడాతో ఆసీస్ జట్టుకు సిరీస్ ను అప్పగించింది. శనివారం (అక్టోబర్ 25) సిడ్నీ వేదికగా ఇరు జట్ల మధ్య నామమాత్రపు మ్యాచ్ జరగనుంది. చివరి వన్డేలోనూ గెలిచి ఇండియాను క్లీన్ స్వీప్ చేయాలని ఆతిధ్య ఆస్ట్రేలియా భావిస్తోంది. మరోవైపు ఇప్పటికే సిరీస్ కోల్పోయిన భారత జట్టు చివరి వన్డేలో గెలిచి పరువు నిలుపుకోవాలని చూస్తుంది. టాస్ ఉదయం 9:00 గంటలకు వేస్తారు. ఈ మ్యాచ్ లో ఇరు జట్ల ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుందో ఇప్పుడు చూద్దాం. 

స్టార్క్, హేజల్ వుడ్ లకు రెస్ట్: 

సిడ్నీ వన్డేలో ఆస్ట్రేలియా స్టార్ ఫాస్ట్ బౌలర్లు స్టార్క్, హేజల్ వుడ్ లకు రెస్ట్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరో నెల రోజుల్లో యాషెస్ ఉండడమే ఇందుకు కారణం. ఎలాగో సిరీస్ వచ్చింది కాబట్టి బెంచ్ ను పరీక్షించే అవకాశాలు లేకపోలేదు. స్టార్క్, హేజల్ వుడ్ స్థానాల్లో నాథన్ ఎల్లిస్, బెన్ ద్వార్షుయిస్ తుది జట్టులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏ రెండు మార్పులు మినహాయిస్తే రెండో వన్డేలో ఆడిన జట్టుతోనే ఆసీస్ ఆడొచ్చు. బ్యాటింగ్ లో ఎలాంటి మార్పులు చేసే అవకాశాలు కనిపించడం లేదు. 

కుల్దీప్ కు ఛాన్స్:
 
సిడ్నీ వన్డేలో వాషింగ్ టన్ సుందర్ స్థానంలో స్పెషలిస్ట్ స్పిన్నర్  కుల్దీప్ యాదవ్ కు తుది జట్టులో స్థానం దక్కొచ్చు. తొలి రెండు వన్డేల్లో  సుందర్ బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. కుల్దీప్ ను ప్లేయింగ్ 11 లో చేర్చి స్పిన్ బౌలింగ్ లో బలహీనమైన ఆస్ట్రేలియాకు చెక్ పెట్టాలని ఇండియా భావిస్తోంది. ఫాస్ట్ బౌలర్లుగా సిరాజ్ తో పాటు అర్షదీప్ కొత్త బంతిని పంచుకోనున్నాడు. హర్షిత్ రానా ఉంటాడా లేదా అనే విషయంలో సస్పెన్స్ కొనసాగుతోంది. 

ఓపెనర్లుగా కెప్టెన్ గిల్ తో పాటు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఇన్నింగ్స్ ను ఆరంభించనున్నారు. టాలెంటెన్డ్ బ్యాటర్ యశస్వి జైశ్వాల్ బెంచ్ కే పరిమితం కానున్నాడు. మూడో స్థానంలో కోహ్లీ స్థానానికి తిరుగులేదు. నాలుగో స్థానంలో వైస్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ బరిలోకి దిగుతాడు. ఐదో స్థానంలో వికెట్ కీపర్ బ్యాటర్ గా రాహుల్ బ్యాటింగ్ చేయనున్నాడు. ఆరో స్థానంలో ఫాస్ట్ బౌలింగ్ ఆల్ రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి.. ఏడో స్థానంలో స్పిన్ బౌలింగ్ ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ ఏడో స్థానంలో బరిలోకి దిగనున్నారు.

ఆస్ట్రేలియాతో మూడో వన్డేకు ఇండియా ప్లేయింగ్ 11 (అంచనా):

రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), నితీష్ కుమార్ రెడ్డి,  కుల్దీప్ యాదవ్, హర్షిత్ రానా, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్