దేశంలో కొత్తగా 2,593 కోవిడ్ కేసులు

దేశంలో కొత్తగా 2,593 కోవిడ్ కేసులు

దేశంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. కొత్తగా 2 వేల 593 కేసులు నమోదయ్యాయి. కరోనాతో మరో 44 మంది మరణించారు.నిన్న ఒక్కరోజే 1755 మంది కోలుకున్నట్లు వైద్యారోగ్యశాఖ ప్రకటించింది. డైలీ పాజిటివిటీ రేటు 0.59శాతం ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం దేశంలో యాక్టీవ్ కేసులు 15 వేల 873 ఉన్నాయి. ఢిల్లీలో కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. నిన్న ఒక్కరోజే అక్కడ 3వేలకుపైగా కేసులు వచ్చాయి. ఇక తమిళనాడులోనూ కరోనా కేసులు కలకలం సృష్టిస్తున్నాయి. నిన్న ఐఐటీ మద్రాస్ లో 55 మందికి కరోనా పాజిటివ్ గా తేలింది. 

అన్ని రాష్ట్రాల్లో కేసులు మళ్లీ పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈనెల 27న అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోడీ వర్చువల్ గా భేటీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కరోనా కట్టడికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రాష్ట్రాలకు సూచనలు ఇవ్వనున్నారు. మరోవైపు టీకా కార్యక్రమాన్ని ముమ్మరం చేసిన కేంద్రం.. 100శాతం సెకండ్ డోస్ కంప్లీట్ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. డీసీజీఐ అనుమతి రాగానే.. ఇటు పిల్లలకు కూడా కార్బెవ్యాక్స్ టీకాను ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. 

మరిన్ని వార్తల కోసం

అమెరికా నుంచి ఇండియన్‌‌ మ్యూజిక్‌‌

విదేశీ గల్లీల్లో మన చాట్​.. మన బజ్జీ