
స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగే ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కి టీంఇండియా రెడీ అవుతోంది.. జూన్ 9 న ఇరు జట్ల మధ్య ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో తొలి మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లో గెలిచి సరికొత్త రికార్డు సృష్టించాలని టీంఇండియా ఎదురుచూస్తోంది. తొలి మ్యాచ్ లో గెలిస్తే టీంఇండియా టీ20లో వరుసగా అత్యధిక మ్యాచ్ లు గెలిచిన జట్టుగా ప్రపంచ రికార్డు సృష్టించనుంది. ఇప్పటివరుకు వరుసుగా 12 టీ20 మ్యాచ్ లు గెలిచిన భారత్... ఆప్ఘనిస్తాన్, రొమేనియాతో సమానంగా ఉంది. గత ఏడాది టీ20 ప్రపంచకప్‌లో సెమీఫైనల్‌కు రేసునుంచి నిష్క్రమించిన తర్వాత టీంఇండియా విజయాల పరంపర మొదలైంది. ఇక ఇప్పటి వరకు టీంఇండియా, దక్షిణాఫ్రికా జట్ల మధ్య 15 టీ20 మ్యాచ్‌లు జరగగా, అందులో టీంఇండియా తొమ్మిదింట్లో నెగ్గగా, ఆరు సార్లు దక్షిణాఫ్రికా విజయం సాధించింది.