నిరాశపరిచిన విరాట్ కోహ్లీ,  రాహుల్

నిరాశపరిచిన విరాట్ కోహ్లీ,  రాహుల్

ఆసియా కప్ లో భాగంగా శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్ లో భారత్ 2  కీలకమైన వికెట్లు కోల్పోయింది. టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేస్తున్న భారత్ కు మంచి ప్రారంభం దక్కలేదు. రెండో ఓవర్ లో దీక్షన వేసిన బౌలింగ్ లో కేఎల్ రాహుల్(6) ఎల్బీగా వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన విరాట్ కోహ్లీ కూడా వెంటనే డకౌట్ అయ్యాడు. మూడో ఓవర్లో మధుశంక వేసిన బౌలింగ్ లో విరాట్ కోహ్లీ(0) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 4 ఓవర్లు ముగిసే సమయానికి భారత్ స్కోర్ 22/2. రోహిత్ శర్మ(10), సూర్యకుమార్ యాదవ్(3) పరుగులతో క్రీజులో ఉన్నారు.