2036 ఒలింపిక్స్‌పై ఇండియా ఫోకస్.. ఆతిథ్యం కోసం ప్రజెంటేషన్‌!

2036 ఒలింపిక్స్‌పై ఇండియా ఫోకస్.. ఆతిథ్యం కోసం ప్రజెంటేషన్‌!

2036 Olympics: ఒలింపిక్స్‌‌, పారాలింపిక్స్‌‌–2036 క్రీడలకు ఆతిథ్యం ఇచ్చే దిశగా ఇండియా మరో కీలక అడుగు వేసింది. దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న క్రీడా మౌలిక సదుపాయాలను వివరిస్తూ, ఆతిథ్య ఏర్పాట్లకు సంబంధించిన ప్రణాళికను అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) ఫ్యూచర్ హోస్ట్ కమిషన్ ముందు ఉంచింది. 

గురువారం ఆన్‌‌లైన్ వేదికగా జరిగిన ఈ సమావేశంలో సుమారు 30 నిమిషాల పాటు ప్రజెంటేషన్ ఇచ్చిన అనంతరం, కొలిండా గ్రాబర్-కిటారోవిచ్ నేతృత్వంలోని తొమ్మిది మంది సభ్యుల కమిషన్‌‌తో 20 నిమిషాల పాటు చర్చలు జరిగాయి. ప్రతిపాదిత ఆతిథ్య నగరమైన అహ్మదాబాద్ సన్నద్ధత, అక్కడి క్రీడా మౌలిక సదుపాయాలు, భారత ఒలింపిక్ సంఘానికి (ఐఓఏ) నగర, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల నుంచి అందుతున్న సహకారాన్ని ఈ ప్రజెంటేషన్‌‌లో ప్రధానంగా వివరించారు.