లాహోర్​ ఎయిర్​ డిఫెన్స్​ సిస్టమ్​ను.. ధ్వంసం చేసిన హార్పి డ్రోన్లు

లాహోర్​ ఎయిర్​ డిఫెన్స్​ సిస్టమ్​ను.. ధ్వంసం చేసిన హార్పి డ్రోన్లు
  • చైనా నుంచి కొనుగోలు చేసిన
  • హెచ్​క్యూ 9ను ధ్వంసం  

న్యూఢిల్లీ:  చైనా నుంచి పాకిస్తాన్ కొనుగోలు చేసిన క్షిపణులు, హెచ్​క్యూ 9 యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ ను ఇండియా ధ్వంసం చేసింది. ఆపరేషన్ సిందూర్​లో భాగంగా ప్రయోగించిన డ్రోన్లు, మిసైళ్లను లాహోర్​లో ఏర్పాటు చేసిన పాక్​ డిఫెన్స్ సిస్టమ్ పసిగట్టలేకపోయింది. ఇండియా దాడులతో లాహోర్​లోని డిఫెన్స్ వ్యవస్థ కుప్పకూలిపోయింది. చైనా నుంచి కొన్న మిసైళ్లు, డిఫెన్స్ సిస్టమ్ వాడకంపై పాక్ ఆర్మీకి అవగాహన లేదని తెలుస్తున్నది. ఇండియా నుంచి వస్తున్న డ్రోన్లు, మిస్సైల్స్‎ను సైతం పసిగట్టలేని విధంగా చైనా యుద్ధ సామాగ్రి ఉన్నది. 

లాహోర్​లో ఏర్పాటు చేసిన మిసైల్ రక్షణ కవచాన్ని మన హార్పి డ్రోన్లు డిస్ట్రాయ్ చేశాయి. దీంతో పాకిస్తాన్ సైన్యం ఆ ప్రాంతంలో గగన రక్షణ రహితంగా మారింది.  సియాల్కోట్‌‌‌‌‌‌‌‌లోని ఎయిర్ డిఫె న్స్ యూనిట్లు కూడా తీవ్రంగా దెబ్బతిన్నట్లు తెలుస్తున్న ది. కాగా, లాహోర్‌‌‌‌‌‌‌‌లో జరిగిన దాడిని పాకిస్తాన్ సైన్యం ధృవీకరించింది. నలుగురు సైనికులు గాయపడగా, మియానోలో ఒక పౌరుడు చనిపోయినట్లు పేర్కొన్నది.  

హెచ్​క్యూ9 డిఫెన్స్ సిస్టమ్

హెచ్​క్యూ9 అనేది చైనా తయారు చేసిన అత్యాధునిక ఎయిర్ డిఫెన్స్ మిసైల్ సిస్టమ్. దీన్ని హాంగ్ క్వీ-9 (రెడ్ బ్యానర్-9) అని కూడా పిలుస్తారు. ఇది ఒక లాంగ్- రేంజ్, సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ (ఎస్​ఏఎం) సిస్టమ్. ఇది యుద్ధ విమానాలు, క్రూయిజ్ మిసైళ్లు, బాలిస్టిక్ మిసైళ్లు, ఇతర గగన బెదిరింపులను అడ్డుకోగలదు. పాకిస్తాన్ సైన్యం ఈ సిస్టమ్‌‌ను తమ ఎయిర్ డిఫెన్స్ సామర్థ్యాన్ని బలోపేతం చేయడానికి ఉపయోగిస్తుంది. లాహోర్ వంటి కీలక నగరాల్లో దీన్ని మోహరించింది. చైనా ఏరోస్పేస్ సైన్స్ అండ్ ఇండస్ట్రీ కార్పొరేషన్ దీన్ని తయారు చేసింది. 200 నుంచి 250 కిలో మీటర్ల పరిధి, 30 నుంచి 35 కిలో మీటర్ల ఎత్తులో ఉన్న లక్ష్యాలను ఛేదిస్తాయి.