రూ.45వేల కోట్లతో 6 సబ్​మెరైన్లు

రూ.45వేల కోట్లతో 6 సబ్​మెరైన్లు

– నేవీ చరిత్రలో భారీ డీల్​.. ఈఓఐ జారీ

ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్​ 75(ఐ)లో భాగంగా ఆరు అత్యాధునిక డీజిల్​– ఎలక్ట్రిక్​ సబ్​మెరైన్ల తయారీకి సంబంధించి నేవీ కీలక ముందడుగు వేసింది. రూ.45వేల కోట్ల వ్యయంతో విదేశీ సంస్థలతో కలిసి చేపట్టబోయే మెగా ప్రాజెక్టులో భాగస్వామి కావాలనుకునే దేశీ కంపెనీలను ఆహ్వానిస్తూ గురువారం ఎక్స్​ప్రెషన్​ ఆఫ్​ ఇంట్రస్ట్​(ఈఓఐ) జారీ చేసింది.  ప్రస్తుతం అందుబాటులో ఉన్న స్కార్పియన్​ శ్రేణి సబ్​మెరైన్లకు అదనంగా కొత్తవాటిని నిర్మిస్తారు. బిడ్​ ద్వారా ఎంపికయ్యే కంపెనీ.. ఇండియన్​ స్ట్రాటజిక్​ పార్ట్​నర్​గా వ్యవహరిస్తూ, ​ టెక్నాలజీని అందించే విదేశీ సంస్థతో కలిసి పనిచేస్తుంది. నిర్మాణ పనులన్నీ స్థానికంగానే చేపడతారు. వచ్చే ఐదేండ్లలో ఆరు సబ్​మెరైన్ల నిర్మాణం పూర్తిచేయాల్సి ఉంటుంది. స్ట్రాటజిక్​ పార్ట్​నర్​షిప్​ విధానంలో నేవీ చేపడుతున్న రెండో అతి పెద్ద ప్రాజెక్టు ఇది.  గతంలో 111 యులిటిటీ హెలికాప్టర్లకు ఒప్పందం కుదిరింది.