ప్రపంచ ఆకలి సూచికలో 94వ ప్లేస్‌‌‌లో భారత్

ప్రపంచ ఆకలి సూచికలో 94వ ప్లేస్‌‌‌లో భారత్

న్యూఢిల్లీ: ప్రపంచ ఆకలి సూచికలో భారత్ స్థానం మరింత దిగజారింది. ఈ ఏడాది ప్రకటించిన ప్రపంచ ఆకలి సూచికలో 107 దేశాల్లో భారత్ 94వ ర్యాంకులో నిలిచింది. వరల్డ్‌‌వైడ్‌‌గా తీవ్ర ఆకలి ఉన్న దేశాల లిస్టును గ్లోబల్ హంగర్ ఇండెక్స్ (జీహెచ్‌‌ఐ) ప్రకటించింది. మన దేశంలో ఆకలి సమస్య తీవ్రంగా ఉందని జీహెచ్‌‌‌ఐ చెప్పింది. నిర్దేశిత విధానాల అమలు పేలవడంగా ఉండటంతోపాటు నిపుణుల పర్యవేక్షణ కొరవడటమే దీనికి కారణమని పేర్కొంది. ఈ రిపోర్టు ప్రకారం ఇండియాలో 14 శాతం మంది ప్రజలు పోషకాహార లోపంతో బాధపడుతున్నారు.