భారీగా పెరిగిన యూనికార్న్​లు .. గ్లోబల్​గా ఇండియాకు మూడోస్థానం

భారీగా పెరిగిన యూనికార్న్​లు .. గ్లోబల్​గా ఇండియాకు మూడోస్థానం
  • మొదటి ప్లేసులో అమెరికా రెండోస్థానంలో చైనా

న్యూఢిల్లీ: గ్లోబల్ యూనికార్న్​‌‌‌‌ల జాబితాలో భారతదేశం మూడవ స్థానంలో ఉంది.   అయితే యూఎస్ (703),​  చైనా (340) కంటే చాలా వెనుకబడి ఉంది. ది హురున్ రీసెర్చ్ ఇన్​స్టిట్యూట్  నివేదిక ప్రకారం, భారతదేశంలో మొత్తం 67 యూనికార్న్​‌‌‌‌లు  ఉన్నాయి. 2023లో ఈ చార్ట్ నుంచి  బైజూస్,  ఫార్మ్ ఈజీ బయటకు వచ్చాయి. గత ఏడాదిలో ప్రతి రెండు రోజులకు ఒక యూనికార్న్ ఏర్పడింది.  ప్రపంచంలో మొత్తం 1,453 యూనికార్న్​‌‌‌‌లు ఉన్నాయి. బిలియన్​ డాలర్ల కంటే ఎక్కువ వాల్యుయేషన్​ ఉన్న స్టార్టప్​ను యూనికార్న్​అంటారు.

అత్యంత విలువైన యూనికార్న్​ ఏది?

టిక్​టాక్​ యజమాని బైట్​డ్యాన్స్​220 బిలియన్ల డాలర్ల వాల్యుయేషన్​తో ప్రపంచంలోనే అత్యంత విలువైన యూనికార్న్​గా ఎదిగింది. ప్రపంచంలోని యూనికార్న్​‌‌‌‌ల మొత్తం విలువ 5 ట్రిలియన్ల డాలర్లకు చేరుకుంది. ఇది జపాన్ జీడీపీకి సమానం. ఓపెన్​ఏఐ సాయంతో ఈ యూనికార్న్​ వాల్యుయేషన్ వేగంగా పెరుగుతోంది. ఏఐతో దీని విలువ 80 బిలియన్​ డాలర్లు పెరిగింది. మరో యూనికార్న్​ స్పేస్​ఎక్స్​ వాల్యుయేషన్​ను 43 బిలియన్​ డాలర్లు పెంచుకుంది. 

ఇండియాలో పరిస్థితి ఎలా ఉందంటే...

హురున్ ఇండియా  ప్రధాన పరిశోధకుడు అనాస్ రెహమాన్ జునైద్ మాట్లాడుతూ, “ఇటీవలి స్టాక్ మార్కెట్లు బాగా లాభపడ్డాయి.  గరిష్ఠ స్థాయిలకు చేరుకున్నప్పటికీ, స్టార్టప్​లలో పెట్టుబడులు లేకపోవడంతో భారతదేశం  స్టార్ట్-అప్ పర్యావరణ వ్యవస్థ మందగించింది.  భారతదేశం నుంచి వ్యవస్థాపకులు ఇతర దేశాల కంటే ఎక్కువ ఆఫ్‌‌‌‌షోర్ యూనికార్న్​‌‌‌‌లను నిర్మించారు. భారతదేశంలో 67 యూనికార్న్​‌‌‌‌లతో పోలిస్తే భారతదేశం వెలుపల 109 యూనికార్న్​‌‌‌‌లను స్థాపించారు”అని ఆయన వివరించారు. భారతదేశం వెలుపల ఏర్పాటైన యూనికార్న్​‌‌‌‌లలో ఎక్కువగా అమెరికాలో ఉన్నాయి. ఇలా దాదాపు 95 ఏర్పాటయ్యాయి. భారతదేశంలో  మొట్టమొదటి ఏఐ యూనికార్న్​ అయిన క్రుట్రిమ్ చురుగ్గా కదులుతోంది. ఇప్పటికీ, యూఎస్,​  చైనాతో పోల్చినప్పుడు మన యూనికార్న్​లు బలహీనంగానే ఉన్నాయని హురున్​ పేర్కొంది.

గత రెండేళ్లలో యూనికార్న్​గా మారిన ఇండియా స్టార్టప్​లు(టాప్​-10)
సంస్థ పేరు    రంగం


పెర్ఫియోస్    సాస్, ఫిన్‌‌టెక్
క్రుట్రిమ్ రీసెర్చ్    సర్వీసెస్, ఏఐ
జెప్టో    క్విక్​ కామర్స్​ 
మోల్బియో    హెల్త్‌‌టెక్, మెడ్‌‌టెక్
టాటా 1ఎంజీ    హెల్త్‌‌టెక్
షిప్​రాకెట్​    లాజిస్టిక్స్
5ఐఆర్​ఈ    ఫిన్‌‌టెక్ 
వన్​కార్డ్​    ఫిన్​టెక్​ 
ఫిజిక్స్ వాలా    ఎడ్​టెక్
లీడ్​ స్క్వేర్డ్    సాస్, సీఆర్​ఏం