
టాటా మోటార్స్ కి చెందిన జాగ్వార్ ల్యాండ్ రోవర్ (JLR) కంపెనీ పై జరిగిన సైబర్ దాడి వల్ల ఉత్పత్తి, అమ్మకాలు దెబ్బతిన్నాయని, అంతేకాకుండా కొంత డేటా కూడా చోరీకి గురయిందని కంపెనీ తెలిపింది.
మా సిస్టమ్స్‌పై సైబర్ దాడి ప్రభావాన్ని అంచనా వేయడానికి కంపెనీ వెంటనే ఫోరెన్సిక్ దర్యాప్తు మొదలుపెట్టింది. ఈ దర్యాప్తులో ఎవరి డేటా అయితే ప్రభావం అయ్యిందో గుర్తించి, వారికి సమాచారం అందిస్తామని JLR తెలిపింది.
అయితే ఈ సైబర్ దాడి జరిగిన వెంటనే దాడి ప్రభావాన్ని తగ్గించడానికి సిస్టమ్స్‌ని తాత్కాలికంగా ఆఫ్ చేసేసారు. దీనివల్ల ఉత్పత్తికి సమస్య కలుగగా, కొద్దిరోజుల పాటు ఉద్యోగులను ఇంటికి పంపించారు.
ప్రస్తుతం జరుగుతున్న దర్యాప్తు గురించి ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తామని కంపెనీ హామీ ఇచ్చింది.
ALSO READ : EMIలో ఫోన్లు కొన్నోళ్లకు RBI షాక్..
ఈ సైబర్ దాడి కారణంగా JLR కంపెనీకి ఆర్థికంగా కూడా నష్టం కలిగింది. అయితే భారతదేశంలో మాత్రం ప్రభుత్వం లగ్జరీ కార్లపై GST రేటు తగ్గించడంతో JLR రేంజ్ రోవర్, డిఫెండర్, డిస్కవరీ మోడళ్ళపై ధరలను 4 లక్షల 50వేల నుండి 30 లక్షల 40 వేల వరకు తగ్గించింది.
సైబర్ దాడులు ఈ రోజుల్లో సాధారణం అయిపోయాయి. మార్క్స్ & స్పెన్సర్, కో-ఆప్ వంటి పెద్ద కంపెనీలు కూడా ఇలాంటి దాడులకు బలైపోయాయి. ఇప్పటికే అతిపెద్ద మార్కెట్ అయిన అమెరికాలో సుంకాలతో సతమతమవుతున్న కంపెనీకి ఈ సైబర్ దాడి మరో దెబ్బ. ట్రంప్ ప్రభుత్వం కార్ల దిగుమతులపై సుంకాలను విధించడంతో జూలైలో JLR అమ్మకాలు దాదాపు 11% తగ్గింది.