గువాహటి: వెస్టిండీస్‌తో రెండో వన్డేకు టీమిండియా సిద్ధమైంది. బుధవారం ఇరుజట్ల మధ్య జరిగే ఈ మ్యాచ్‌లో గెలిచి ఇక్కడే సిరీస్‌ను కైవసం చేసుకోవాలని ఇండియా లక్ష్యంగా పెట్టుకుంది. అదే టైమ్‌లో ఈ మ్యాచ్ గెలిచి సిరీస్‌లో ఆశలు సజీవంగా ఉంచుకోవాలని కరీబియన్లు ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇరుజట్ల మధ్య హోరాహోరీ పోరు జరగడం ఖాయంగా కనిపిస్తోంది.
టీమిండియా బ్యాటింగ్ పటిష్టంగా కనిపిస్తున్నా.. పేస్ బౌలింగ్ కూర్పుపై స్పష్టత రావడం లేదు. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా అందుబాటులో లేకపోవడంతో, ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఫిట్‌నెస్ సాధించకపోవడంతో సెలెక్టర్లు పేస్ బౌలింగ్‌లో ప్రయోగాలు చేస్తున్నారు. తొలి వన్డేలో సీనియర్ పేసర్ సిరాజ్‌కు రెస్ట్ ఇచ్చి ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్‌కు కొత్త బాల్‌ను అప్పగించారు. ఈ ప్రయోగం బెడిసికొట్టడంతో ఇప్పుడు సిరాజ్, అకిబ్ నబీలో ఎవరికి చాన్స్ ఇవ్వాలన్న దానిపై సందిగ్ధత కొనసాగుతోంది. బ్యాటింగ్‌లో రోహిత్ కాస్త గాడిలో పడితే మరోసారి భారీ స్కోరు ఖాయం. కింగ్ కోహ్లీ, కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌పై మరోసారి భారీ అంచనాలున్నాయి. మరోవైపు తొలి మ్యాచ్‌లో క్యాచ్‌లు పట్టడంలో ఫెయిలైన విండీస్ ఈసారి ఆ తప్పులను సరిదిద్దుకోవాలని యోచిస్తోంది. బ్యాటింగ్‌లో మెరుగ్గా ఉన్నా.. ఇండియా బ్యాటర్లను ఆపే దమ్ము విండీస్ బౌలర్లలో కొరవడింది. కాబట్టి బౌలింగ్‌పైనే కరీబియన్లు ఎక్కువగా దృష్టి పెట్టనున్నారు.
