దేశంలో కొత్తగా 3,545 కోవిడ్ కేసులు

దేశంలో కొత్తగా 3,545 కోవిడ్ కేసులు

దేశంలో కరోనా  వ్యాప్తి కొనసాగుతోంది.  ఢిల్లీలో  వెయ్యికి పైగా  కొత్త కేసులు నమోదవుతుండగా.. మహారాష్ట్రలో  200 పైగా  కొత్త కేసులు వచ్చాయి.  గత 24 గంటల్లో  3 వేల 545 కొవిడ్ కేసులొచ్చాయి.  ఢిల్లీలో 1365 మందికి  కరోనా సోకగా.. కేరళ,  ఉత్తరప్రదేశ్,  హర్యానా రాష్ట్రాల్లో వైరస్ వ్యాప్తి  పెరుగుతోంది. 40 రోజుల  తర్వాత మహారాష్ట్రలో  200కు పైగా  కొత్త కేసులొచ్చాయి. గడిచిన 24 గంటల  వ్యవధిలో 27 మంది  వైరస్ బారిన పడి  చనిపోయారు. మరో 3 వేల 549 మంది  కొవిడ్ నుంచి  రికవరీ అయ్యారు. కరోనా  యాక్టివ్ కేసులు  19 వేల 688 కి పెరిగాయి. ఇప్పటివరకు 189  కోట్లకు పైగా  టీకా డోసులు పంపిణీ అయ్యాయి. 

మరిన్ని వార్తల కోసం

టీఆర్, కవిత ప్రశ్నలకు రేవంత్ కౌంటర్

సీఎం కేసీఆర్ కు బండి సంజయ్ లేఖ