Dog Robot: కుక్క రోబో వచ్చిందండి..మనుషులకు సేవ చేస్తదట

Dog Robot: కుక్క రోబో వచ్చిందండి..మనుషులకు సేవ చేస్తదట

మనుషుల్లాంటి రోబోలు వచ్చాయి. వివిధ రకాల సేవలు అందిస్తున్నాయి. అయితే తాజాగా కుక్క రోబోలు వచ్చాయి. వీటిని మన దేశానికి చెందిన ప్రముఖ రోబోటిక్స్  కంపెనీ యాడ్ వెర్బ్ తయారు చేసింది. ఈ డాగ్ రోబోట్ ను LogiMAT ఇండియా 2024 ఆవిష్కరించింది. దీని పేరు ట్రాకర్(Trakr).. ట్రాకర్ తోపాటు ‘హీల్, సింక్రో అనే మరో  రెండు రోబోట్ లను కూడా యాడ్ వెర్బ్ కంపెనీ ఆవిష్కరించింది. 

ట్రాకర్ రోబోట్ ఎజిలిటీ, సౌకర్యాల తనిఖీలు,గస్తీ, నిఘాలో ఉపయోగపడుతుంది.  ఇది ఎటువంటి వర్క్ ఫోర్స్ కైనా సిద్ధంగా ఉంటుంది. ‘హీల్’ రోబోటో గుండె సంబంధిత  వైద్యపరమైన చికిత్సలో సహకారాన్ని అందించేందుకు , MRI స్కాన్ ల వంటి రిమోట్ ఇమేజింగ్ సిస్టమ్ లో సహాయ పడుతుంది. Syncro  రోబోట్ మనుషులతోకలిసి పనిచేసేందుకు రూపొందించబడిందని,ఆపరేషన్ స్టాండర్డ్ రెడిఫైన్ చేసేందుకు సహకారం అందిస్తుందని కంపెనీ సీఈవో చెప్పారు.

2016లో ప్రారంభించబడిన యాడ్ వెర్బ్ కంపెనీ .. గోదాంలు, పారిశ్రామిక ఆటోమేషన్ కోసం స్మార్ట్ ఎండ్ టు ఎండ్ రోబోట్ లను అందిస్తుంది. ఆధునాతన భద్రతాఫీచర్లు, వాడుకలో సౌలభ్యం కోసం రోబోట్ ల తయారీ చేస్తోంది.