కుప్పకూలిన టీమిండియా.. టెస్ట్ హిస్టరీలో తక్కువ స్కోరు

కుప్పకూలిన టీమిండియా.. టెస్ట్ హిస్టరీలో తక్కువ స్కోరు

అడిలైడ్: ఆస్ట్రేలియాతో తొలి టెస్టులో రెండో రోజు మంచి ప్రదర్శన కనబర్చిన టీమిండియా మూడో రోజు ఘోరమైన పెర్ఫామెన్స్ ఇచ్చింది. ఓవర్‌‌నైట్ స్కోరు 9/1తో ఆరంభించిన మెన్ ఇన్ బ్లూ.. మరో 27 రన్స్ జోడించి 8 వికెట్లు కోల్పోయింది. టెయిలెండర్ మహ్మద్ షమి రిటైర్డ్ హార్ట్‌‌గా వెనుదిరిగాడు. ఆసీస్ బౌలర్ల ధాటికి టీమిండియా బ్యాటింగ్ పేకమేడలా కూలిపోయింది. ముఖ్యంగా హేజల్‌‌వుడ్ లైన్ అండ్ లెంగ్త్ బంతులకు భారత్ బ్యాట్స్‌‌మెన్ దగ్గర సమాధానం లేకపోయింది. అతడు 5 వికెట్లతో భారత్ నడ్డి విరిచాడు. ప్యాట్ కమిన్స్ 4 వికెట్లతో సత్తా చాటాడు. టీమిండియా టెస్టు చరిత్రలో ఒక ఇన్నింగ్స్‌‌లో ఇదే తక్కువ స్కోరు. 90 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్‌‌ మొదలుపెట్టిన ఆసీస్‌‌ ఓపెనర్లు జోరు మీదున్నారు.

ఒక ఇన్నింగ్స్‌‌లో భారత్ అతి తక్కువ స్కోరు విషయానికి వస్తే ఇవ్వాళ ఆస్ట్రేలియా పై చేసిన 36 రన్స్ అత్యల్పం. ఇంతకుముందు ఇంగ్లండ్ పై 1974లో 42 రన్స్‌‌కు టీమిండియా ఆలౌట్ అయ్యింది. ఆ తర్వాత ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌‌ల పై 58 రన్స్‌‌కు ఆలౌట్ అయ్యింది. ఇక అన్ని దేశాల విషయానికి వస్తే.. ఇంగ్లండ్‌‌తో మ్యాచ్‌‌లో న్యూజిలాండ్ 1955లో 26 రన్స్‌‌కే ఆలౌటైంది. సౌతాఫ్రికా 30 రన్స్‌‌కు రెండు సార్లు ఆలౌట్ అయ్యింది. 36 రన్స్‌‌కు ఆలౌట్ అయిన హిస్టరీ, సౌతాఫ్రికాతోపాటు ఆస్ట్రేలియా పేరిట ఉంది.