క్రెడిట్ కార్డుల వాడకంలో రికార్డు..: పండుగ సీజన్, ఆన్‌లైన్ షాపింగే కారణం..

 క్రెడిట్ కార్డుల వాడకంలో రికార్డు..: పండుగ సీజన్, ఆన్‌లైన్ షాపింగే కారణం..

భారతదేశంలో క్రెడిట్ కార్డుల ద్వారా జరిగే ఖర్చు అక్టోబరు నెలలో భారీగా పెరిగింది. దింతో ఒక్క అక్టోబర్‌లో నెలలో క్రెడిట్ కార్డుల ఖర్చు  రూ.2.14 లక్షల కోట్లకు చేరింది. ఇది గత ఏడాది రూ.1.79 లక్షల కోట్లతో  పోలిస్తే ఏకంగా 19.6% ఎక్కువ. దీనికి ముఖ్య కారణం ఆన్‌లైన్ షాపింగ్  అమ్మకాలు, పండుగ సీజన్‌లో ప్రజలు ఎక్కువగా  కొనుగోళ్లు చేయడమే. అయితే క్రెడిట్ కార్డుల ద్వారా ఖర్చు చేయడం పెరిగినా, కొత్త క్రెడిట్ కార్డులు జారీ చేయడం మాత్రం తగ్గింది. సెప్టెంబర్‌లో 10.76 లక్షల కొత్త కార్డులు ఇస్తే, అక్టోబర్‌లో  6.27 లక్షలకు పడిపోయింది.

*HDFC బ్యాంక్ అక్టోబర్‌లో 1.44 లక్షల కొత్త కార్డులు ఇవ్వగా.. సెప్టెంబర్‌తో పోలిస్తే  44% తక్కువ.
*SBI కార్డ్ సెప్టెంబర్‌లో 1.73 లక్షల కార్డులు ఇవ్వగా, అక్టోబర్‌లో 1.27 లక్షల కార్డులు మాత్రమే ఇచ్చింది.
*ICICI బ్యాంక్  కొత్త క్రెడిట్ కార్డుల జారీలో ఏకంగా 46% క్షీణత కనిపించింది.

అయితే క్రెడిట్ కార్డుల మార్కెట్‌లో ప్రైవేట్ బ్యాంకుల వాటా బాగా పెరిగింది. ఇప్పుడు వాటి వాటా 77.7%గా ఉంది. కస్టమర్ల సెలెక్క్షన్లో ఈ బ్యాంకులు మరింత కఠినమైన నియమాలు పాటించడం, మంచి ఫైన్షియల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న కస్టమర్లపైనే దృష్టి పెట్టడం దీనికి కారణం. ప్రైవేట్ బ్యాంకులు మెట్రో నగరాల్లో ఖర్చు ఎక్కువ పెట్టగలిగే కస్టమర్లను టార్గెట్ చేసుకుంటున్నాయి.

  భారతదేశంలో టాప్ నాలుగు బ్యాంకులైన  HDFC, SBI కార్డ్, ICICI, యాక్సిస్ బ్యాంక్ మొత్తం క్రెడిట్ కార్డుల లావాదేవీలలో దాదాపు 75% నుండి 77% వాటాతో ఉన్నాయి. కొత్తగా జారీ చేసిన కార్డులు మెట్రో నగరాలకే పరిమితం అయిన లోన్ల విషయంలో కొంచెం ఒత్తిడి కనిపిస్తోంది.  కొత్త కార్డులు ఇవ్వడం తగ్గించి, ఇప్పటికే ఉన్న మంచి కస్టమర్ల ద్వారా ఎక్కువ ఖర్చు చేయించడంపై బ్యాంకులు ఇప్పుడు దృష్టి పెడుతున్నాయి.