అమెరికాలో దీపావళి: రోడ్లపై క్రాకర్స్ చెత్త.. షేమ్ అంటున్న తోటి ఇండియన్స్

అమెరికాలో దీపావళి: రోడ్లపై క్రాకర్స్ చెత్త.. షేమ్ అంటున్న తోటి ఇండియన్స్

న్యూజెర్సీ: దీపావళి.. దీపాల కాంతుల సంబరం. పటాకులు కాల్చి ఎంజాయ్ చేసే పండుగ. చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ ఎంజాయ్ చేసే ఫెస్టివల్ ఇది. కానీ, ఈ పండుగ వేడుకలు జరుపుకున్న తీరు అమెరికాలో మనోళ్లను నవ్వులపాలు చేసింది. షేమ్.. షేమ్ అంటూ ఎన్నారైలను భారతీయులే ఎగతాళి చేసే స్థితికి తెచ్చింది.

ఇండియా స్క్వేర్ దగ్గర ధూం ధాం.. న్యూజెర్సీ పోలీసులకు పాట్లు

అమెరికాలోని న్యూజెర్సీలో ప్రవాస భారతీయులు దీపావళి నాడు ఘనంగా సంబరాలు చేసుకున్నారు. ఇండియా స్క్వేర్ దగ్గర భారీగా జనాలు చేరి ధూం ధాంగా పటాకులు కాల్చి ఎంజాయ్ చేశారు. కానీ, క్రాకర్స్ కాల్చాక ఆ చెత్తనంతా ఎక్కడిదక్కడే వదిలేసి వెళ్లిపోయారు. వీధుల్లో ఖాళీ క్రాకర్స్ బాక్సులు, పేల్చాక ఎగిరిపడిన తుక్కు అంతా గలీజుగా పడి ఉంది.

శుభ్రతపై క్లాసులు తీసుకోవాలంటూ..

ఆ చెత్తను న్యూజెర్సీ పోలీసులు శుభ్రం చేయాల్సి వచ్చింది. వాళ్లు వాటర్ కెనాల్స్ తో రోడ్లు క్లీన్ చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. దీనిపై తోటి ఇండియన్సే పొట్టుపొట్టుగా తిట్టిపోస్తున్నారు. పండుగ చేసుకుని చెత్త ఇలా వదిలేసి పోవడం షేమ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. మన వాళ్లందరికీ  శుభ్రత మీద క్లాసులు తీసుకోవాలంటూ మరికొందరు ట్విట్లు చేశారు. తాను యూకేలోనూ ఇలాంటి ఘటనలు చూశానని, స్వచ్ఛతపై పట్టకుండా వ్యవహరించడం దారుణమని బాలా ఐయ్యర్ అనే నెటిజన్ ట్వీట్ చేశారు.