ఇండియా - శ్రీలంక మధ్య ఫెర్రీ సర్వీసులు : రూట్, ఛార్జీ, టైమింగ్స్ ఇలా

ఇండియా - శ్రీలంక మధ్య ఫెర్రీ సర్వీసులు : రూట్, ఛార్జీ, టైమింగ్స్ ఇలా

భారతదేశం - శ్రీలంక ప్రయాణీకుల ఫెర్రీ సర్వీస్‌ను నిలిపివేసిన దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత, హైస్పీడ్ షిప్ మరోసారి అందుబాటులోకి వచ్చింది. అక్టోబర్ 13న తమిళనాడులోని నాగపట్టినాన్ని,  శ్రీలంకలోని ఉత్తర ప్రావిన్స్‌లోని కంకేసంతురైతో అనుసంధానించే చెరియపానిని కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్ & జలమార్గాలను ఆయుష్ మంత్రి సర్బానంద సోనోవాల్ ప్రారంభించారు. ఈ ఫెర్రీ ద్వారా 3-4 గంటల్లో భారత్ నుంచి శ్రీలంక చేరుకోవచ్చు.

చెరియపాణి, కెప్టెన్ బిజు జార్జ్ ఆధ్వర్యంలో 50 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బందితో నాగపట్నం ఓడరేవు నుంచి కంకేసంతురై వైపు ఈ షిప్ బయలుదేరింది. ఫెర్రీ తన ప్రయాణాన్ని పూర్తి చేయడానికి మూడు గంటల సమయం పడుతుందని భావిస్తున్నారు. ప్యాసింజర్ ఫెర్రీ సర్వీసును పునరుద్ధరించిన తర్వాత ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలిపారు. “మేము భారతదేశం - శ్రీలంక మధ్య దౌత్య, ఆర్థిక సంబంధాలలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నాం. నాగపట్నం, కంకేసంతురై మధ్య ఫెర్రీ సర్వీస్ ప్రారంభించడం మా సంబంధాలను బలోపేతం చేయడంలో ఒక ముఖ్యమైన మైలురాయి అని ఆయన ఓ వీడియో ప్రసంగంలో తెలిపారు.

నాగపట్నం షిప్పింగ్ హార్బర్ డిపార్ట్‌మెంట్ అధికారులు అక్టోబర్ 14న ఒకరోజు ప్రమోషనల్ ఆఫర్‌గా రూ.2వేల 375, 18 శాతం పన్నుతో సహా రూ. 2వేల 800 ప్రత్యేక ఛార్జీని ప్రవేశపెట్టారు. ఇది సాధారణ టిక్కెట్ ధర కంటే దాదాపు 75 శాతం తక్కువ. ఒక్కొక్కరికి రూ. 6వేల 500 బేస్ ఫేర్, 18 శాతం జీఎస్టీతో కలిపి మొత్తం రూ. 7వేల 670గా నిర్ణయించారు. ఈ ప్రయాణం కోసం దాదాపు 30 మంది ప్రయాణికులు తమ టిక్కెట్లను బుక్ చేసుకున్నారు.