
దోహా: వరల్డ్ బిలియర్డ్స్ చాంపియన్‌షిప్‌లో ఇండియా స్టార్ క్యూయిస్ట్‌లు పంకజ్ అద్వాణీ, సౌరవ్ కోఠారి ఫైనల్ చేరుకున్నారు. సోమవారం జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో పంకజ్ 900–273తో ఇండియాకే చెందిన రూపేశ్ షాను ఓడించాడు. మరో పోరులో సౌరవ్ 900–756తో ధ్రువ్ సిత్వాలపై గెలిచాడు.