ఇండియాకు డచ్‌‌‌‌ టెస్ట్.. నేడు జూ. హాకీ వరల్డ్ కప్‌‌‌‌ క్వార్టర్ ఫైనల్

ఇండియాకు డచ్‌‌‌‌ టెస్ట్.. నేడు జూ. హాకీ వరల్డ్ కప్‌‌‌‌ క్వార్టర్ ఫైనల్

కౌలాలంపూర్‌‌‌‌‌‌‌‌: మెన్స్ జూనియర్ వరల్డ్ కప్‌‌‌‌ హాకీ టోర్నమెంట్‌‌‌‌లో మూడోసారి విజేతగా నిలవడమే టార్గెట్‌‌‌‌గా బరిలోకి దిగిన ఇండియా అసలైన సవాల్‌‌‌‌కు సిద్ధమైంది. మంగళవారం జరిగే క్వార్టర్‌‌‌‌‌‌‌‌ ఫైనల్లో బలమైన నెదర్లాండ్స్‌‌‌‌తో అమీతుమీ తేల్చుకోనుంది.  

గ్రూప్‌‌‌‌ దశలో రెండు విజయాలు, ఒక ఓటమితో పూల్‌‌‌‌–సిలో రెండో ప్లేస్‌‌‌‌తో ఇండియా నాకౌట్‌‌‌‌కు రాగా.. డచ్‌‌‌‌ టీమ్ రెండు విజయాలు, ఒక డ్రాతో పూల్‌‌‌‌–డిలో టాప్‌‌‌‌ ప్లేస్‌‌‌‌ సాధించింది. దాంతో క్వార్టర్స్‌‌‌‌లో టీమిండియాకు డచ్‌‌‌‌ టీమ్‌‌‌‌ నుంచి గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం ఉంది.