సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కు ఇక గుడ్ బై

 సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కు ఇక గుడ్ బై

సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అంటే.. ఒకసారి వినియోగించి పారవేసే ప్లాస్టిక్ ఉత్పత్తులు. వీటిపై జూలై 1 నుంచి నిషేధం విధిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఈవిషయాన్ని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ మంగళవారం వెల్లడించారు.  సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగానికి దూరంగా ఉండాలని గతంలోనూ పలుమార్లు హెచ్చరించామని, ఇందుకు ఇవ్వాల్సిన దాని కంటే ఎక్కువ సమయమే ఇచ్చామని ఆయన తెలిపారు.

ఏయే వస్తువులపై అంటే..

సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కు సంబంధించిన ఉత్పత్తి, దిగుమతి, నిల్వ, పంపిణీ, అమ్మకాలు, వినియోగాలపై  నిషేధం ఉంటుందని స్పష్టం చేశారు. దీనితో పాటు పాలీస్టెరీన్, పాలీస్టెరీన్ కమొడిటీస్పైనా నిషేధం అమలవుతుందని తేల్చి చెప్పారు. నిషేధిత సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తు ఉత్పత్తుల  జాబితాలో.. బెలూన్ల ప్లాస్టిక్ స్టిక్ లు, ప్లాస్టిక్ ఇయర్ బడ్స్, ఐస్ క్రీమ్ స్టిక్స్, క్యాండీ స్టిక్స్, ప్లాస్టిక్ కప్స్, ప్లాస్టిక్ గ్లాసులు, ప్లాస్టిక్ లేదా పీవీసీ బ్యానర్లు (100 మైక్రాన్ల కంటే తక్కువవి), ప్లాస్టిక్ స్పూన్ లు, నైవ్స్, ఫోర్క్స్, స్ట్రాలు కూడా ఉన్నాయి.  స్వీట్ బాక్స్ లు, సిగరెట్ ప్యాకెట్లు,  ఇన్విటేషన్ కార్డులపై అలంకరణ కోసం వాడే వ్రాపింగ్ ప్లాస్టిక్ ఫిల్మ్ లు  కూడా నిషేధిత జాబితాలో ఉన్నాయి.