2022లో ఇంగ్లండ్‌‌తో ఇండియా ఏకైక టెస్ట్‌‌

V6 Velugu Posted on Sep 26, 2021

లండన్‌‌: టీమిండియాలో కరోనా కలకలం రేగడంతో ఇంగ్లండ్‌‌తో రద్దయిన ఐదో టెస్ట్‌‌కు సంబంధించి బీసీసీఐ, ఈసీబీ  ఓ నిర్ణయానికి వచ్చాయి.  వచ్చే ఏడాది (2022) ఇండియా, ఇంగ్లండ్‌‌ మధ్య ఓ టెస్ట్‌‌ మ్యాచ్‌‌ నిర్వహించేందుకు అంగీకరించాయి. దీంతో ఐదు మ్యాచ్‌‌ల టెస్ట్‌‌ సిరీస్‌‌ పూర్తి కానుంది.  ఇంగ్లండ్‌‌ సమ్మర్‌‌ సీజన్‌‌ అయిన జూన్‌‌, జులై, ఆగస్టు నెలల్లో ఏదో ఒక టైమ్‌‌లో ఈ మ్యాచ్‌‌ ఉంటుంది. అయితే ఏకైక టెస్ట్‌‌ కోసం కోహ్లీసేన యూకే వెళుతుందా లేదా ఆగస్టులో షెడ్యూల్‌‌ చేసిన వైట్‌‌ బాల్‌‌ సిరీస్‌‌లో భాగంగా ఈ మ్యాచ్‌‌ ఆడుతుందా అనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది. కాగా ఈ టెస్ట్‌‌ మ్యాచ్‌‌కు బదులుగా ఇరుజట్ల మధ్య రెండు టీ20లు ఆడించాలనే ప్రతిపాదనపై కూడా ఇరు బోర్డులు చర్చించాయి. కానీ బీసీసీఐ టెస్ట్​ వైపే మొగ్గింది. 

Tagged test match, India play, one Test, England 2022

Latest Videos

Subscribe Now

More News