అమెరికాకు నమ్మకమైన భాగస్వామి భారత్ 

అమెరికాకు నమ్మకమైన భాగస్వామి భారత్ 

కోవిడ్ సమయంలో భారత్, యూఎస్ ఒకరినొకరు మద్దతు ఇవ్వడంలో కీలకపాత్ర పోషించాయని వాషింగ్టన్ లోని భారత రాయబారి తరంజిత్ సింగ్ సంధు తెలిపారు. గత రెండేళ్లుగా ప్రపంచ సరఫరా గొలుసులో అంతరాయం కారణంగా వివపరీతమైన సవాళ్లను రెండు దేశాలు ఎదుర్కొన్నాయని చెప్పారు. రెండు దేశాల శక్తి సామర్థ్యాలు, పరిస్థితులకు తగ్గట్టు అనేక చర్యలు తీసుకోవడంతో కరోనా నుంచి బయటపడ్డాయన్నారు. ఫిలడెల్ఫియాకు దాదాపు రెండు మిలియన్ మాస్క్ లను సరఫరా చేశామని తరంజిత్ సింగ్ స్పష్టం చేశారు. దేశీయంగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ను మెరుగుపర్చడం విదేశీ కంపెనీలు భారత్ లో పెట్టుబడులు పెట్టేందుకు ప్రోత్సాహకాలు అందిస్తున్నామన్నారు. భారీ నిర్మాణాలు, కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. ఆర్థిక సంస్కరణలతో ఇండియా అభివృద్ధిలో పరుగులు పెడుతుందన్నారు. 

మరిన్ని వార్తల కోసం

ఏడాది చివరి నాటికి కొత్త పంబన్ వంతెన పూర్తి

శ్రీలంకలో 50 రోజులుగా కొనసాగుతున్న నిరసనలు