ఆదుకున్న జడేజా..ఇంగ్లండ్ టార్గెట్-171

ఆదుకున్న జడేజా..ఇంగ్లండ్ టార్గెట్-171

బర్మింగ్‌హామ్‌: ఇంగ్లండ్‌తో జరుగుతోన్న రెండో టీ20లో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 170 రన్స్ చేసింది. భారత బ్యాటర్లలో జడేజా 46 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. రోహిత్‌ శర్మ(31), రిషబ్‌ పంత్‌(26) పరుగులతో రాణించారు. ఇక కోహ్లి మరోసారి నిరాశపరిచాడు. టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన భారత్ కు మంచి స్టార్ట్ దక్కింది. హిట్ మ్యాన్ దూకుడుగా ఆడటంతో పవర్ ప్లేలో వికెట్ నష్టానికి 61 రన్స్ చేశారు. ఆ తర్వాత వెంటనే 3 వికెట్లు కోల్పోయిన భారత్ కష్టాల్లో పడింది.

ఆదుకుంటారనుకున్న హార్ధిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్ తక్కువ స్కోర్ కే ఔట్ కావడంతో 89/5 పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ తర్వాత వచ్చిన దినేశ్ కార్తీక్ కూడా ఔట్ .. దీంతో కనీసం టీమిండియా కనీసం 150 రన్స్ అయినా చేస్తుందా అనుకునే సమయంలో ఆల్ రౌండర్ జడేజా(46 నాటౌట్) ఆచితూచి ఆడుతూ భారత్ కు గౌరవ ప్రదమైన స్కోర్ అందించాడు. ప్రారంభంలో 200 స్కోర్ దాటుతుందనుకున్న భారత్  8 వికెట్ల నష్టానికి 170 రన్స్ చేసింది. ఇంగ్లండ్‌ బౌలర్లలో అరంగేట్ర మ్యాచ్‌లోనే రిచర్డ్ గ్లీసన్‌ మూడు వికెట్లతో చెలరేగగా.. క్రిస్‌ జోర్డాన్‌ నాలుగు వికెట్లు పడగొట్టాడు.

లక్ష్యఛేదనలో బరిలోకి దిగిన ఇంగ్లండ్ ప్రారంభంలోనే జాసెన్ రాయ్ వికెట్ కోల్పోయింది. ఫస్ట్ ఓవర్ లో భువనేశ్వర్ కుమార్ వేసిన తొలిబంతికే రాయ్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. మూడో ఓవర్ లోనూ భువి డేంజర్ బట్లర్ ను ఔట్ చేశాడు. దీంతో 2 కీలకమైన వికెట్లను భువనేశ్వర్ తీసుకున్నాడు. భారత బౌలర్లు ఇలాగే చెలరేగితే టీమిండియాకు గెలిచే అవకాశాలు ఉన్నాయి. 5 ఓవర్లకు ఇంగ్లండ్ స్కోర్ -27/3