
రాంచీ : ఒక్క గెలుపు దూరంలో పారిస్ ఒలింపిక్స్ బెర్తు ఊరిస్తుండగా ఎఫ్‌ఐహెచ్ ఒలింపిక్ క్వాలిఫయర్స్ టోర్నమెంట్‌లో తమకంటే మెరుగైన ర్యాంకర్ జర్మనీతో ఇండియా విమెన్స్ హాకీ టీమ్ సెమీఫైనల్ సవాల్‌కు సిద్ధమైంది. గురువారం జరిగే ఈ మ్యాచ్‌లో తమ అత్యుత్తమ ఆటతో జర్మనీ పని పట్టి ఫైనల్ చేరుకోవడమే కాకుండా పారిస్‌కు క్వాలిఫై అవ్వాలని టార్గెట్‌గా పెట్టుకుంది. పూల్–బి తొలి మ్యాచ్‌లోనే 0–1తో అమెరికా చేతిలో ఓడినా న్యూజిలాండ్, ఇటలీని ఓడించి ఇండియా సెమీస్ చేరుకుంది.