Ind vs Sl, 2nd ODI: నేడు లంకతో ఇండియా రెండో వన్డే

Ind vs Sl, 2nd ODI: నేడు లంకతో ఇండియా రెండో వన్డే

    మ. 1.30 నుంచి స్టార్​ స్పోర్ట్స్​లో ​

కోల్​కతా: ఓవైపు వన్డే వరల్డ్​కప్​ ప్రిపరేషన్స్​.. మరోవైపు ఫామ్​లోకి వచ్చిన సీనియర్లు.. ఈ నేపథ్యంలో టీమిండియా.. శ్రీలంకతో రెండో మ్యాచ్​కు సిద్ధమైంది. గురువారం ఈడెన్​ గార్డెన్స్​లో జరిగే ఈ మ్యాచ్​లోనే లంకేయులను పడగొట్టి సిరీస్​ను కైవసం చేసుకోవాలని ఇండియా టార్గెట్​గా పెట్టుకుంది. సరిగ్గా ఎనిమిదేళ్ల కిందట ఇదే గ్రౌండ్​లో వరల్డ్​ రికార్డు స్కోరు (264)తో చెలరేగిపోయిన హిట్​మ్యాన్​ రోహిత్​ శర్మపై అందరి దృష్టి నెలకొనగా, కింగ్​ కోహ్లీ మరో సెంచరీతో సత్తా చాటాలని ఫ్యాన్స్​ ఆశిస్తున్నారు. ఈ మ్యాచ్​ కోసం ఇండియా ఫైనల్​ ఎలెవన్​లో మార్పులు జరిగే అవకాశం కనిపించడం లేదు.  రోహిత్​కు తోడుగా గిల్​ ఓపెనింగ్​ చేయనున్నాడు. హిట్​మ్యాన్​కు ఈడెన్​ అచ్చొచ్చిన పిచ్​ కావడంతో మరో భారీ స్కోరుపై కన్నేశాడు. 

బ్యాకప్​ ఓపెనర్​గా గిల్​ తనను తాను నిరూపించుకోవాలని చూస్తున్నాడు. ఈ ఇద్దరికి తోడు కింగ్​ కోహ్లీ ఫామ్​లో ఉండటం ప్లస్​ పాయింట్. అయితే శ్రేయస్​ అయ్యర్​తొలి వన్డేలో నిరాశ పరచడం ఒక్కటే  ఆందోళన కలిగించింది.  ఒకవేళ అతన్ని తప్పించి రాహుల్​ను నాలుగో నంబర్​లో ఆడిస్తే  కీపర్​గా ఇషాన్​ కిషన్​ టీమ్​లోకి రావొచ్చు. కానీ ఒక్క మ్యాచ్​కే శ్రేయస్​ను తప్పిస్తారా? చూడాలి. ఆల్​రౌండర్​ హార్దిక్ పాండ్యా కూడా ఫామ్​ అందుకోవాల్సిన అవసరం ఉంది. మరోవైపు తొలి మ్యాచ్​లో బౌలింగ్​లో తేలిపోయిన లంక ఈడెన్​లో ఎలాగైనా గెలిచి సిరీస్​ రేసులో నిలవాలని ఆశిస్తోంది. కెప్టెన్​ షనకపై ఎక్కువగా ఆధారపడుతున్న లంక ముందుకెళ్లాలంటే ఇతర ప్లేయర్లూ బాధ్యతగా ఆడాల్సిన అవసరం ఉంది. తొలి వన్డేలో భుజానికి గాయమైన బౌలర్ దిల్షాన్​ మదుషనక అందుబాటులో ఉంటాడో లేదో చూడాలి.