
న్యూఢిల్లీ: షాంఘై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్ సమ్మిట్‌కు హాజరయ్యేందుకు ప్రధాని నరేంద్ర మోడీ కిర్గిస్థాన్‌కు పర్యటనకు వెళ్లాల్సి ఉంది. ఈ నేపథ్యంలో మోడీ ఫ్లైట్‌ను పాకిస్థాన్ ఎయిర్‌స్పేస్ నుంచి వెళ్లేందుకు పర్మిషన్ ఇవ్వాలని ఇండియా అధికారులు ఆ దేశాన్ని కోరారు. బాలాకోట్ దాడి జరిగిన తర్వాత ఎయిర్‌స్పేస్‌ను మూసేసిన పాకిస్థాన్ సౌత్‌వైపు ఉన్న ఎయిర్‌స్పేస్‌ను మాత్రమే తెరిచింది. మోడీ కిర్గిస్థాన్ వెళ్లేందుకు పాకిస్థాన్ ఎయిర్‌స్పేస్ నుంచే వెళ్లాల్సి ఉన్నందున పర్మిషన్ కోరామని అధికారులు చెప్పారు. మే 21న మాజీ కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్ కిర్గిస్థాన్ వెళ్లాల్సి ఉండగా.. ఆమె ఫ్లైట్‌కు పాకిస్థాన్ పర్మిషన్ ఇచ్చింది.