
ఎక్కువ టీవీలు వాడుతున్న దేశాల్లో ఇండియా త్వరలోనే టాప్‌లో నిలుస్తుందని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవడేకర్ అన్నారు. మున్ముందు మనదగ్గర ప్రతి ఇంట్లో టీవీ ఉంటుందని చెప్పారు. దేశంలోని 25 కోట్ల కుటుంబాల్లో 18 కోట్ల ఫ్యామిలీలకు టీవీ ఉందన్నారు. శనివారం కాశ్మీర్‌లో ఫ్రీ డిష్ టీవీ సెట్‌టాప్ బాక్సులను మంత్రి పంచారు. జమ్మూకాశ్మీర్‌కు దూర్‌దర్శన్ శాటిలైట్ చానల్‌ను, డీడీ కాశ్మీర్‌లో తొలి న్యూస్ బులెటిన్‌ను ప్రారంభించారు. తర్వాత మాట్లాడుతూ.. ప్రస్తుతం దేశంలో 700 టీవీ చానళ్లున్నాయని, 1992, 93ల్లో ప్రైవేట్ చానళ్లు వచ్చాక ఈ రంగంలో పెను మార్పులొచ్చాయని చెప్పారు. కేబుల్ టీవీ వల్లే టీవీల సంఖ్య విపరీతంగా పెరిగిందన్నారు. ప్రస్తుతం దేశంలో 9 కోట్ల మంది డీటీహెచ్ ద్వారా టీవీ ప్రసారాలు పొందుతున్నారని చెప్పారు.
కాశ్మీర్‌లో మల్టీప్లెక్స్: గవర్నర్
‘సాయంత్రం ఆరు గంటలైతే చాలు.. సినిమా థియేటర్లు, షాపులు మూతపడతాయ్. కాఫీ షాపు లైసెన్సు పొందాలంటే నాలుగేళ్లు పడుతోంది. దీంతో కాశ్మీర్‌లో వినోదానికి చోటే లేకుండా పోయింది. ఈ పరిస్థితిని మార్చేందుకు కాశ్మీర్‌లో ఓ మల్టీప్లెక్స్ ఏర్పాటు చేయాలని ప్రయత్నిస్తున్నాం’ అని జమ్మకాశ్మీర్గవర్నర్సత్యపాల్మాలిక్చెప్పారు. రూమర్లలో నిజమేదో, అబద్ధమేదో దూరదర్శన్‌తో తెలుసుకోవచ్చన్నారు.