
వన్డే ట్రై సిరీస్‌ను భారత మహిళల జట్టు విజయంతో ప్రారంభించింది. ఆదివారం (ఏప్రిల్ 27) శ్రీలంక మహిళలతో జరిగిన మ్యాచ్ లో 9 వికెట్ల తేడాతో అలవోక విజయాన్ని అందుకుంది. కొలంబోలో వర్షం కారణంగా ఆలస్యమైన ఈ మ్యాచ్ 39 ఓవర్లకు కుదించాల్సి వచ్చింది. 148 పరుగుల లక్ష్య ఛేదనలో ఓపెనర్ ప్రతీకా రావల్ (50) అజేయ అర్ధ సెంచరీతో రాణించగా.. స్మృతి మంధాన (43), హర్లీన్ డియోల్ (48) రాణించి టీమిండియాకు గెలును అందించాడు. మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక 38.1 ఓవర్లలో 147 పరుగులకు ఆలౌట్ అయింది. లక్ష్య ఛేదనలో భారత్ 29.4 ఓవర్లలో వికెట్ నష్టానికి 149 పరుగులు చేసి గెలిచింది.
ఈ మ్యాచ్‌లో భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ టాస్ గెలిచి మొదట బౌలింగ్ ఎంచుకుంది. భారీ వర్షం కారణంగా మూడు గంటలు ఆలస్యం కావడంతో మ్యాచ్‌ను 39 ఓవర్లకు కుదించారు. స్నేహ్ రాణా (3/31), శ్రీ చరణి (2/26), దీప్తి శర్మ (2/22) విజృంభించడంతో శ్రీలంక 38.1 ఓవర్లలో 147 పరుగులకు ఆలౌటైంది. శ్రీలంకలో ఎవరూ పెద్దగా రాణించలేకపోయారు. హాసిని పెరెరా 46 బంతుల్లో 30 పరుగులు చెస్ టాప్ స్కోరర్ గా నిలిచింది. కవిషా దిల్హారి 26 బంతుల్లో 25 పరుగులతో పర్వాలేదనిపించింది.
►ALSO READ | MI vs LSG: బ్యాటింగ్‌లో ముంబై ధనాధన్.. పూరన్ పైనే లక్నో ఆశలు
148 పరుగుల లక్ష్య ఛేదనలో భారత జట్టుకు అదిరిపోయే ఆరంభం లభించింది. ప్రతిక (50 నాటౌట్), మంధాన (43) తొలి వికెట్ కు 54 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆ తర్వాత హర్లీన్ (48 నాటౌట్) తో కలిసి ప్రతిక అజేయంగా 95 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దీంతో శ్రీలంక నిర్దేశించిన 148 పరుగుల లక్ష్యాన్ని 29.4 ఓవర్లలోనే ఛేదించింది. హాఫ్ సెంచరీ చేసిన ప్రతీక రావల్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఈ టోర్నీలో తర్వాత మ్యాచ్ మంగళవారం (ఏప్రిల్ 29) ఇండియా, సౌతాఫ్రికా మధ్య జరుగుతుంది.
India's top three seal a dominant win after their bowlers restricted Sri Lanka to 147 in a shortened game https://t.co/CkgMUzWHn2 #SLvIND pic.twitter.com/zKy5WAK07Y
— ESPNcricinfo (@ESPNcricinfo) April 27, 2025