పంచుకుంటరా.. ఇచ్చేస్తరా?

పంచుకుంటరా.. ఇచ్చేస్తరా?
  •     నేడు సౌతాఫ్రికాతో ఇండియా విమెన్స్ మూడో టీ20
  •     ఈ మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కూ వాన ముప్పు
  •     రా. 7 నుంచి స్పోర్ట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 18లో లైవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

చెన్నై : సొంతగడ్డపై  సౌతాఫ్రికాతో ఆఖరాటకు ఇండియా అమ్మాయిలు రెడీ అయ్యారు. మంగళవారం జరిగే మూడో, చివరి టీ20 మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నారు. ఈ పోరులో  గెలిచి సిరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను 1–1తో పంచుకోవాలని భావిస్తున్నారు. తొలి మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  ఇండియా పోరాడి ఓడగా.. రెండో పోరు  వర్షంతో రద్దయింది. అయితే ఈ మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కూ వర్షం ముప్పు పొంచి ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఒకవేళ వాతావరణం అనుకూలించి ఆట సాగితే ఇండియా తమ బౌలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను మెరుగుపరుచుకోవాల్సి ఉంటుంది. గత రెండు మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్లో బౌలర్లు నిరాశ పరిచారు.

దాంతో తొలి మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 189/9, రెండో మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 177/6 స్కోర్లతో సఫారీ బ్యాటర్లు పైచేయి సాధించారు. రెండు మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్లో రెండేసి వికెట్లు పడగొట్టిన పూజా వస్త్రాకర్ తప్ప మిగతా బౌలర్లు ప్రభావం చూపలేకపోయారు. జోరుమీదున్న సౌతాఫ్రికా బ్యాటర్లను అడ్డుకోవాలంటే  పేసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రేణుకా సింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, స్పిన్నర్ దీప్తి శర్మ సత్తా చాటాల్సిన అవసరం ఉంది.