
నార్తాంప్టన్: ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌కు సన్నాహకంగా జరిగిన రెండు వామప్స్‌లోనూ ఇండియా గెలిచింది. తొలి పోరులో డెర్బిషైర్‌పై నెగ్గిన ఇండియా.. పేసర్ హర్షల్ పటేల్ (36 బాల్స్‌లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 54; 2/23) ఆల్‌రౌండ్ పెర్ఫామెన్స్ చేయడంతో ఆదివారం జరిగిన తమ రెండో టీ20 వామప్ మ్యాచ్‌లో 10 రన్స్ తేడాతో నార్తాంప్టన్‌షైర్‌ను ఓడించింది. తొలుత ఇండియా 20 ఓవర్లలో 149/8 స్కోరు చేసింది. శాంసన్ (0), త్రిపాఠి (7), సూర్య (0) ఫెయిలైనా.. కెప్టెన్ దినేశ్ కార్తీక్ (34), వెంకటేశ్ (20)తో కలిసి హర్షల్ జట్టును ఆదుకున్నాడు. అనంతరం ఛేజింగ్‌లో నార్తాంప్టన్‌షైర్ 19.3 ఓవర్లలో 139కే ఆలౌటైంది. హరల్‌తో పాటు అర్ష్‌దీప్ (2/29), అవేశ్ (2/16), చహల్ (2/25) రాణించారు. ఇండియా, ఇంగ్లండ్ మధ్య మూడు టీ20ల సిరీస్‌లో తొలి మ్యాచ్ ఈ నెల 7న జరుగుతుంది.