టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్

టీ20 సిరీస్ విజయమే లక్ష్యంగా న్యూజిలాండ్ తో చివరి టీ20లో భారత బరిలోకి దిగింది. ఇందులో భాగంగా టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి మ్యాచ్ లో ఓడిన హార్దిక్ సేన..రెండో మ్యాచ్ లో గెలిచి సిరీస్ సమం చేసింది. ప్రస్తుతం ఇరు జట్లు 1-1తో సమంగా ఉన్న నేపథ్యంలో  ఈ మ్యాచ్ లో ఎలాగైనా గెలవాలని రెండు జట్లు పట్టుదలతో ఆడుతున్నాయి. 

టీమిండియా తుది జట్టు: హార్దిక్​ (కెప్టెన్​), గిల్​, ఇషాన్​, రాహుల్​ త్రిపాఠి, సూర్యకుమార్, దీపక్​ హుడా, వాషింగ్టన్​ సుందర్​, శివమ్​ మావి, కుల్దీప్​ యాదవ్​, ఉమ్రాన్​ మాలిక్​, అర్ష్​దీప్​ సింగ్​. 

న్యూజిలాండ్ తుది జట్టు​: శాంట్నర్​ (కెప్టెన్​), ఫిన్​ అలెన్​, కాన్వే, చాప్​మన్​, గ్లెన్​ ఫిలిప్స్​, డారిల్​ మిచెల్​, మైకేల్​ బ్రేస్​వెల్​,సోధీ, ఫెర్గుసన్​,  బెంజమైన్ లిస్టర్, ​ టిక్నర్​.