రైజా-గుర్‌‌జోత్‌‌‌‌‌‌‌‌ జోడీకి బ్రాంజ్‌‌‌‌‌‌‌‌

రైజా-గుర్‌‌జోత్‌‌‌‌‌‌‌‌ జోడీకి బ్రాంజ్‌‌‌‌‌‌‌‌

కువైట్‌‌‌‌‌‌‌‌ సిటీ: ఇండియా యంగ్‌‌‌‌‌‌‌‌ షూటర్‌‌‌‌‌‌‌‌ రైజా ధిల్లాన్‌‌‌‌‌‌‌‌–గుర్​జోత్‌‌‌‌‌‌‌‌ కంగురా జోడీ.. ఆసియా ఒలింపిక్‌‌‌‌‌‌‌‌ క్వాలిఫికేషన్‌‌‌‌‌‌‌‌ షాట్‌‌‌‌‌‌‌‌ గన్‌‌‌‌‌‌‌‌ కాంపిటీషన్‌‌‌‌‌‌‌‌లో బ్రాంజ్‌‌‌‌‌‌‌‌ మెడల్‌‌‌‌‌‌‌‌తో మెరిసింది. ఆదివారం జరిగిన స్కీట్‌‌‌‌‌‌‌‌ మిక్స్‌‌‌‌‌‌‌‌డ్‌‌‌‌‌‌‌‌ టీమ్‌‌‌‌‌‌‌‌ సెకండ్‌‌‌‌‌‌‌‌ బ్రాంజ్‌‌‌‌‌‌‌‌ మెడల్‌‌‌‌‌‌‌‌ మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో  రైజా–గుర్​జోత్‌‌‌‌‌‌‌‌ 41–39తో లోకల్‌‌‌‌‌‌‌‌ ఫేవరెట్స్‌‌‌‌‌‌‌‌ అబ్దుల్లా అల్‌‌‌‌‌‌‌‌రషీద్‌‌‌‌‌‌‌‌–ఎమన్‌‌‌‌‌‌‌‌ అల్‌‌‌‌‌‌‌‌ షామాపై నెగ్గారు. 17 మందితో కూడిన క్వాలిఫికేషన్‌‌‌‌‌‌‌‌ రౌండ్‌‌‌‌‌‌‌‌లో రైజా ద్వయం 138 పాయింట్లు సాధించింది. ఓవరాల్‌‌‌‌‌‌‌‌గా ఈ టోర్నీలో ఇండియా ఒక గోల్డ్‌‌‌‌‌‌‌‌, మూడు సిల్వర్‌‌‌‌‌‌‌‌, నాలుగు బ్రాంజ్‌‌‌‌‌‌‌‌ మెడల్స్‌‌‌‌‌‌‌‌తో నాలుగో ప్లేస్‌‌‌‌‌‌‌‌లో నిలిచింది.