ఇండియన్2 తోపాటే 3 కూడా.. 70 శాతం షూట్ కంప్లీట్.. శంకర్ మాస్టర్ ప్లాన్

ఇండియన్2 తోపాటే 3 కూడా.. 70 శాతం షూట్ కంప్లీట్.. శంకర్ మాస్టర్ ప్లాన్

తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్(Shankar) తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ ఇండియన్2(Indian2). లోకనాయకుడు కమల్ హాసన్(Kamal haasan) హీరోగా వస్తున్న ఈ పాన్ ఇండియా సినిమా కోసం ఆడియన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. 1996లో వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమా భారతీయుడు(Bharatheyudu)కు ఇది సీక్వెల్. అందుకే ఈ సినిమాపై అంచనాలు భారీగా నెలకొన్నాయి. అందుకు తగ్గట్టుగానే భారీ స్థాయిలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు దర్శకుడు శంకర్. 

ఇక తాజాగా ఈ సినిమా నుండి వినిపిస్తున్న న్యూస్ ఒకటి ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. అదేంటంటే.. ఇండియన్ సినిమాకు మరో సీక్వెల్ కూడా ఉండనుందంట. దానికి సంబంధించిన 70 శాతం షూట్ కూడా ఇప్పటికే కంప్లీట్ చేసేసారట. అయితే ఇండియన్2 సినిమా షూట్ కి సంబంధించిన మొత్తం ఫుటేజ్ దాదాపు 6 గంటలు వచ్చిందట. ఆ ఆరుగంటల ఫుటేజ్ ను మూడు గంటల సినిమాగా కట్ చేయడం సాధ్యం కానీ పని.. అందుకే మిగిలిన ఫుటేజ్ తో మరో పార్ట్ ప్లాన్ చేస్తున్నారట శంకర్. మరికొన్ని సీన్స్ యాడ్ చేస్తే మరో పార్ట్ కూడా సిద్ధం కానుంది. ఇక ఈ రెండు పార్ట్స్ ను ఏడాది గ్యాప్ లో రిలీజ్ చేయాలని చూస్తున్నారట. ఇక త్వరలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన రానుంది.

ఇక శంకర్ తెలుగులో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్(Ram charan) తో గేమ్ ఛేంజర్(Game changer) సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పొలిటికల్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ(Kiara adwani) హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా 2024లో ప్రేక్షకుల ముందుకు రానుంది.