ఇండియన్ 2 సంక్రాంతికే?

ఇండియన్ 2 సంక్రాంతికే?

గతేడాది ‘విక్రమ్’ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్‌‌‌‌ను అందుకున్న కమల్ హాసన్..  ప్రస్తుతం ‘ఇండియన్2’ సినిమాలో నటిస్తున్నారు. శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్‌‌‌‌ శరవేగంగా జరుగుతోంది. వాస్తవానికి నాలుగేళ్ల క్రితమే షూటింగ్ మొదలుపెట్టినా.. సెట్‌‌‌‌లో క్రేన్ యాక్సిడెంట్, టీమ్ మధ్య వచ్చిన విభేదాల కారణంగా షూటింగ్‌‌‌‌కి బ్రేక్‌‌‌‌ పడింది. ఆ సమస్యలన్నింటినీ పరిష్కరించుకున్న మేకర్స్ లాస్ట్ ఇయర్ తిరిగి షూటింగ్‌‌‌‌ను స్టార్ట్ చేశారు. అప్పట్నుంచీ వరుస  షెడ్యూల్స్‌‌‌‌తో ఏపీ, తెలంగాణతో పాటు తైవాన్, ఆఫ్రికాలోనూ కొన్ని సీన్లు షూట్ చేశారు. ఆగస్టుకి మొత్తం షూటింగ్‌‌‌‌ను పూర్తి  చేయాలనుకున్నారు. కానీ ఈ నెలాఖరుకే పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

ప్రస్తుతం ఫైనల్ షెడ్యూల్ షూటింగ్ జరుగుతోంది. అనుకున్న దానికంటే ముందే షూటింగ్ పూర్తవడంతో టీమ్ అంతా హ్యాపీ ఫీలవుతున్నట్టు తెలుస్తోంది.  దీంతో సంక్రాంతికే సినిమా రిలీజ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే రామ్ చరణ్‌‌‌‌తో శంకర్ తీస్తున్న ‘గేమ్ ఛేంజర్‌‌‌‌‌‌‌‌’ను సంక్రాంతికే విడుదల చేస్తామన్నారు. దీంతో రెండింటిలో ఏది సంక్రాంతికి వస్తుందో అనే విషయంపై ఆసక్తి నెలకొంది. ఇక ‘ఇండియన్‌‌‌‌ 2’లో కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్‌‌‌‌సింగ్, ప్రియా భవానీశంకర్  హీరోయిన్స్‌‌‌‌గా నటిస్తున్నారు. సిద్ధార్థ్​, ఎస్.జె.సూర్య, బాబీ సింహా, మనోబాల, వెన్నెల కిశోర్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.  లైకా ప్రొడక్షన్స్ సుభాస్కరణ్‌‌‌‌తో కలిసి ఉదయనిధి స్టాలిన్‌‌‌‌ నిర్మిస్తున్నారు.