టెన్త్ అర్హతతో ఎయిర్ఫోర్స్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల.. మహిళాలకి కూడా ఛాన్స్.. అప్లయ్ చేసుకోండి..

టెన్త్ అర్హతతో ఎయిర్ఫోర్స్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల.. మహిళాలకి కూడా ఛాన్స్.. అప్లయ్ చేసుకోండి..

భారత వాయుసేన ఫ్లయింగ్, గ్రౌండ్ డ్యూటీ (టెక్నికల్, నాన్ – టెక్నికల్) విభాగాల్లో ‘ఏ’ గెజిటెడ్ అధికారుల పోస్టుల భర్తీకి పురుష, మహిళా అభ్యర్థుల నుంచి అప్లికేషన్లు కోరుతున్నది. ఈ ఖాళీలను ఎయిర్​​ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ ఎంట్రీ 01/ 2026, నేషనల్ క్యాడెట్ కోర్స్ స్పెషల్ ఎంట్రీ ద్వారా భర్తీ చేయనున్నారు. ఈ కోర్స్ 2027, జనవరిలో ప్రారంభం కానున్నది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్​లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. అప్లికేషన్ల స్వీకరణ నవంబర్ 17న ప్రారంభమవుతుంది. డిసెంబర్ 14 వరకు అప్లై చేయవచ్చు. 2026, జనవరి 31న ఏఎఫ్​సీఏటీ ఎగ్జామ్ నిర్వహించనున్నారు. 

పోస్టులు
ఏఎఫ్​సీఏటీ ఎంట్రీ

ఫ్లయింగ్: మెన్ (షార్ట్ సర్వీస్ కమిషన్) 34, వుమెన్ (షార్ట్ సర్వీస్ కమిషన్) 04. 

గ్రౌండ్ డ్యూటీ (టెక్నికల్): మెన్ (పర్మినెంట్ కమిషన్) ఏఈ (ఎల్) 03, ఏఈ (ఎం) 09, వుమెన్ (పర్మినెంట్ కమిషన్) ఏఈ(ఎల్) 03, ఏఈ(ఎం) 03, మెన్ (షార్ట్ సర్వీస్ కమిషన్) ఏఈ(ఎల్) 100, ఏఈ(ఎం) 38, వుమెన్ (షార్ట్ సర్వీస్ కమిషన్) ఏఈ (ఎల్) 23, ఏఈ(ఎం) 09. 

గ్రౌండ్ డ్యూటీ (నాన్ – టెక్నికల్): మెన్ (షార్ట్ సర్వీస్ కమిషన్) వెపన్ సిస్టమ్స్ (డబ్ల్యూఎస్) బ్రాంచ్ 21, అడ్మినిస్ట్రేషన్ 48, లాజిస్టిక్స్ 09, అకౌంట్స్ 08, ఎడ్యుకేషన్, 02, మెటలర్జీ 01. వుమెన్ (షార్ట్ సర్వీస్ కమిషన్) వెపన్ సిస్టమ్స్ (డబ్ల్యూఎస్) బ్రాంచ్ 05, అడ్మినిస్ట్రేషన్ 12, లాజిస్టిక్స్ 02, అకౌంట్స్ 02, ఎడ్యుకేషన్, 02, మెటలర్జీ 02.

ఎన్​సీసీ స్పెషల్ ఎంట్రీ

ఫ్లయింగ్  సీడీఎస్ఈ ఖాళీల్లో 10 శాతం సీట్లు (పర్మినెంట్ కమిషన్),  ఎయిర్​ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ నుంచి 10 శాతం సీట్లు (షార్ట్ సర్వీస్ కమిషన్) కేటాయించారు. 

కమిషన్ రకాలు

పర్మినెంట్ కమిషన్ (పీసీ): టెక్నికల్ బ్రాంచుల్లో పీసీ ఆఫీసర్లుగా చేరే అభ్యర్థులు పదవీ విరమణ వయసు వరకు సర్వీసులో కొనసాగుతారు. 

షార్ట్ సర్వీస్ కమిషన్(ఎస్ఎస్​సీ): ఫ్లయింగ్ బ్రాంచ్ (పురుషులు, మహిళలు) ఎస్ఎస్​సీ ఆఫీసర్లుగా చేరే అభ్యర్థులు 14 ఏండ్ల వరకు సర్వీసులో  కొనసాగుతారు. గ్రౌండ్ డ్యూటీ (టెక్నికల్ & నాన్ టెక్నికల్) ఎస్ఎస్​సీ ఆఫీసర్లుగా చేరే అభ్యర్థులు 10 ఏండ్ల వరకు సర్వీసులో కొనసాగుతారు. మరో నాలుగేండ్లు పొడిగించే అవకాశం ఉంది. 

ఎలిజిబిలిటీ

ఫ్లయింగ్: ఇంటర్మీడియట్ లేదా 10+2 స్థాయిలో ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ చదవడంతోపాటు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి.  లేదా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బి.టెక్/ బీఈలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. 

గ్రౌండ్ డ్యూటీ (టెక్నికల్): గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో బి.టెక్/ బీఈలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

గ్రౌండ్ డ్యూటీ (నాన్– టెక్నికల్): గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి అడ్మినిస్ట్రేషన్, అకౌంట్స్, లాజిస్టిక్స్ లేదా సమానమైన అర్హత కలిగిన రంగాల్లో గ్రాడ్యుయేషన్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. 

వయోపరిమితి

ఫ్లైయింగ్ బ్రాంచ్: 2027, జనవరి 01 నాటికి 20 నుంచి 24 ఏండ్ల మధ్యలో ఉండాలి. లేదా 2003, జనవరి 02 నుంచి 2007, జనవరి 01 మధ్యలో జన్మించిన వారై ఉండాలి. 

డీజీసీఏ జారీ చేసిన చెల్లుబాటు అయ్యే కమర్షియల్ పైలట్ లైసెన్స్ కలిగి ఉన్న అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితి 26 ఏండ్ల వరకు సడలింపు ఉంటుంది. అంటే 2001, జనవరి 02 నుంచి 2007, జనవరి 01 మధ్య జన్మించిన వారై ఉండాలి. 

గ్రౌండ్ డ్యూటీ (టెక్నికల్/ నాన్– టెక్నికల్) బ్రాంచులు: 2027, జనవరి 01 నాటికి 20 నుంచి 26 ఏండ్ల మధ్యలో ఉండాలి. లేదా 2001, జనవరి 2 నుంచి 2007, జనవరి 01 మధ్యలో జన్మించిన వారై ఉండాలి .

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.

అప్లికేషన్ ప్రారంభం: నవంబర్ 17.

అప్లికేషన్ ఫీజు:  అభ్యర్థులు అందరూ రూ.550 + జీఎస్​టీ చెల్లించాల్సి ఉంటుంది. ఎన్​సీసీ స్పెషల్ ఎంట్రీ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఇచ్చారు. 

లాస్ట్ డేట్: డిసెంబర్ 14. 

ఆన్​లైన్ ఎగ్జామ్ డేట్: 2026, జనవరి 31. 

ఏఎఫ్​సీఏటీ ఎగ్జామ్ ప్యాటర్న్ 2026

ఈ ఎగ్జామ్​లో ప్రశ్నలు మల్టిపుల్ చాయిస్ రూపంలో ఉంటాయి. మొత్తం 100 ప్రశ్నలు ఇస్తారు. ఒక్కో ప్రశ్నకు మూడు మార్కులు. మొత్తం 300 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది. రెండు గంటల్లో పూర్తిచేయాలి. జనరల్ అవేర్​నెస్, వెర్బల్ ఎబిలిటీ (ఇంగ్లిష్​), న్యూమరికల్ ఎబిలిటీ, రీజనింగ్ అండ్ మిలిటరీ ఆప్టిట్యూడ్ టెస్ట్ నుంచి ప్రశ్నలు అడుగుతారు.  నెగెటివ్ మార్కులు ఉన్నాయి. ప్రతి తప్పుడు సమాధానానికి 1 మార్కు కోత విధిస్తారు. ఎలాంటి సమాధానం గుర్తించని ప్రశ్నలకు మార్కుల కోత ఉండదు. 

ఎన్​సీసీ స్పెషల్ ఎంట్రీ

ఎన్​సీసీ స్పెషల్ ఎంట్రీకి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా ఎన్​సీసీ ఎయిర్ వింగ్ సీనియర్ డివిజన్ 'సి' సర్టిఫికెట్ కలిగి ఉండాలి. ఎయిర్​ఫోర్స్ కామన్ అడ్మిషన్ రిజిస్ట్రేషన్ తేదీ  నాటి కంటే రెండేండ్ల ముందే సర్టిఫికెట్ కలిగి ఉండాలి. వీరికి రాత పరీక్ష నుంచి మినహాయింపు ఇచ్చారు. ఏఎఫ్ఎస్​బీ కేంద్రాల్లో మిగతా పరీక్షలకు  నేరుగా పిలుస్తారు.

సెలెక్షన్ ప్రాసెస్

ఎయిర్​ఫోర్స్ సెలెక్షన్ బోర్డు రెండు దశల్లో నియామక ప్రక్రియ చేపడుతుంది. స్టేజ్–1లో స్క్రీనింగ్ టెస్టులో భాగంగా ఆఫీసర్ ఇంటెలిజెన్స్ రేటింగ్ (ఓఐఆర్) టెస్ట్, పిక్చర్ పర్సెప్షన్ అండ్ డిస్కషన్ టెస్ట్ (పీపీడీటీ) ఉంటాయి. ఇందులో ఉత్తీర్ణులైన అభ్యర్థులు స్టేజ్–2కు అర్హత సాధిస్తారు.  స్టేజ్–2లో ఐదు రోజులపాటు వివిధ టెస్టులు నిర్వహిస్తారు.

సైకలాజికల్ టెస్ట్: ఇది రాత పూర్వకంగా ఉంటుంది. ఈ ఎగ్జామ్  ప్రొఫెషనల్ సైకలాజిస్టుల సమక్షంలో జరుగుతుంది. 

గ్రూప్ టెస్ట్స్: అభ్యర్థుల మానసిక, శారీరక దారుఢ్యాన్ని పరీక్షించడానికి మానసిక, శారీరక కార్యకలాపాలు ఉంటాయి. 

ఏఎఫ్ఎస్​బీ ఇంటర్వ్యూ: ఈ రౌండులో అభ్యర్థులకు వ్యక్తిగత ఇంటర్వ్యూ ఉంటుంది. 

కంప్యూటరైజ్డ్ పైలట్ సెలెక్షన్ సిస్టమ్ (సీపీఎస్ఎస్) టెస్ట్: ఫ్లయింగ్ బ్రాంచ్ కోసం అప్లై చేసుకున్న అభ్యర్థులకు మాత్రమే ఉంటుంది. 

మెడికల్ ఎగ్జామినేషన్: స్టేజ్–2లో అన్ని రౌండ్లను విజయవంతంగా పూర్తి చేసిన అభ్యర్థులకు మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. 

పూర్తి వివరాలకు afcat.edcil.co.in  వెబ్​సైట్​లో సంప్రదించగలరు.