ఇండియన్ ఆర్మీలో చేరేందుకు మంచి ఛాన్స్.. ఎలాంటి ఫీజు లేదు.. వెంటనే అప్లయ్ చేసుకోండి..

ఇండియన్ ఆర్మీలో చేరేందుకు మంచి ఛాన్స్.. ఎలాంటి ఫీజు లేదు.. వెంటనే అప్లయ్ చేసుకోండి..

ఇండియన్ ఆర్మీ 143వ టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సు కోసం అప్లికేషన్లు కోరుతున్నది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్​లైన్ ద్వారా అప్లయ్  చేసుకోవచ్చు. అప్లికేషన్లు సమర్పించడానికి చివరి తేదీ నవంబర్ 06. 

పోస్టుల సంఖ్య: 30. 

పోస్టులు: సివిల్ 08, కంప్యూటర్ సైన్స్ 06, ఎలక్ట్రికల్ 02, ఎలక్ట్రానిక్స్ 06, మెకానికల్ 06, ఇతర ఇంజినీరింగ్ విభాగాలు 02. 

ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ సంస్థ నుంచి సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ పూర్తి చేసిన అభ్యర్థులు అప్లయ్ చేయవచ్చు. ఇంజినీరింగ్ చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు కూడా అర్హులే. కొన్ని పోస్టులకు ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్ పూర్తిచేసి ఉండాలి. 

వయోపరిమితి: కనీస వయోపరిమితి 20 ఏండ్లు. గరిష్ట వయోపరిమితి 27ఏండ్లు. అభ్యర్థులు 1999, జులై 01 కంటే ముందు గానీ 2006, జూన్ 30 తర్వాత గానీ జన్మించి ఉండకూడదు. నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా. 

అప్లికేషన్లు ప్రారంభం: అక్టోబర్ 08.  

లాస్ట్ డేట్: నవంబర్ 06. 

అప్లికేషన్ ఫీజు: ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు. 

సెలెక్షన్ ప్రాసెస్: షార్ట్​లిస్ట్, ఎస్ఎస్​బీ ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

పూర్తి వివరాలకు joinindianarmy.nic.in వెబ్​సైట్​లో సంప్రదించగలరు.