ట్రక్కుతో నాలుగు వెహికిల్స్ను తుక్కు తుక్కు చేశాడు.. కెనడాలో భారత యువకుడు అరెస్టు.. వీడియో వైరల్ !

ట్రక్కుతో నాలుగు వెహికిల్స్ను తుక్కు తుక్కు చేశాడు.. కెనడాలో భారత యువకుడు అరెస్టు.. వీడియో వైరల్ !

వీడియో గేమ్ చూసుంటారు కదా.. ఒక్కసారి వెహికిల్ స్టార్ట్ చేస్తే రయ్ మంటూ ముందున్న వెహికిల్స్ ను ఢీకొడుతూ పల్టీలు కొడుతుంటుంది. అచ్చం అలాంటి డెడ్లీ సీనే కెనడాలో కనిపించింది. అత్యంత వేగంతో.. బ్రేక్స్ కూడా వేయకుండా ఒక ట్రక్కు నాలువు వెహికిల్స్ ను తుక్కు తుక్కు చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇండియన్ డ్రైవర్ ట్రక్కును అత్యంత వేగంగా నడుపుతూ నాలుగు వాహనాలను వెనక నుంచి ఢీకొట్టడంతో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు చనిపోయినట్లు కెనడా పోలీసులు నిర్ధారించారు. 

మంగళవారం (అక్టోబర్ 21) కెనడాలోని ఒంటారియో 10-ప్రీవే హైవేలో జరిగిన ఈ యాక్సిడెంట్ లో.. ముగ్గురు చనిపోగా.. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనకు బాద్యుడైన ఇండియన్ డ్రైవర్ జషన్ ప్రీత్ సింగ్ (21) ను పోలీసులు  అరెస్టు చేశారు. నార్త్ కాలిఫోర్నియాలో యూబా సిటీలో ఉంటున్న సింగ్.. డ్రగ్స్ మత్తులో ఉండి ఈ ఘటనకు పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. 

►ALSO READ | పాక్‌‌లో మహిళలకు టెర్రరిజం క్లాసులు.. జమాత్ ఉల్-ముమినాత్ పేరిట స్పెషల్ విభాగం ఏర్పాటు

మాదకద్రవ్యాల వినియోగం, పౌరుల హత్య కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. 2022లో అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించినట్లు గుర్తించారు. మాజీ బైడెన్ హయాంలో మళ్లీ విడుదలైనట్లు ఫాక్స్ న్యూస్ పేర్కొంది. యాక్సిడెంట్ తర్వాత నిందితుడిని ఆస్పత్రికి తరలించినట్లు కెనడా పోలీసు అధికారి రోడ్రిగో జిమెనెజ్ తెలిపారు. పరీక్షల్లో డ్రగ్స్ వినియోగించినట్లు తేలిందని డాక్టర్లు నిర్ధారించారని అన్నారు. 

డెడ్లీ యాక్సిడెంట్ వీడియో:

ఈ యాక్సిడెంట్ అత్యంత భయంకరమైందిగా కెనడా అధికారులు పేర్కొన్నారు. డ్రగ్స్ మత్తులో.. అతివేగంతో వచ్చి యాక్సిడెంట్ కు పాల్పడినట్లు చెప్పారు. వెనక నుంచి వచ్చి ఒక ట్రక్కుకు ఢీకొంటే.. అది మరో కార్.. అది మరో వెహికిల్ ను.. ఇలా నాలుగు వాహనాలు తుక్కుతుక్కయిపోయాయి. యాక్సిడెంట్ జరిగినప్పుడు కూడా బ్రేక్స్ వేయలేదని పోలీసులు భావిస్తున్నారు. ఇలాంటి చైన్ క్రాష్ తరహా యాక్సిడెంట్ ఇటీవలి కాలంలో ఇదే పెద్ద ఘటన అని అంటున్నారు.