ఇండియన్ కోస్ట్ గార్డులో నావిక్, యాంత్రిక్ పోస్టులు

ఇండియన్ కోస్ట్ గార్డులో నావిక్, యాంత్రిక్ పోస్టులు

ఇండియ‌‌న్ కోస్ట్ గార్డు  ఆర్మ్‌‌డ్ ఫోర్స్‌‌ల్లో నావిక్ (జ‌‌న‌‌ర‌‌ల్ డ్యూటీ), నావిక్‌‌(డొమెస్టిక్ బ్రాంచ్‌‌), యాంత్రిక్ బ్యాచ్‌‌ పోస్టుల భ‌‌ర్తీకి అర్హులైన పురుష అభ్యర్థుల నుంచి అప్లికేషన్స్ కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 322

పోస్టులు- ఖాళీలు:  నావిక్ (జ‌‌న‌‌ర‌‌ల్ డ్యూటీ): 260, యాంత్రిక్ (మెకానిక‌‌ల్‌‌): 13, నావిక్ (డొమెస్టిక్ బ్రాంచ్‌‌): 35, యాంత్రిక్ (ఎల‌‌క్ట్రానిక్స్‌‌): 5, యాంత్రిక్ (ఎల‌‌క్ట్రిక‌‌ల్‌‌): 9 

అర్హత‌‌: 1) నావిక్ (జ‌‌న‌‌ర‌‌ల్ డ్యూటీ):  మ్యాథ్స్‌‌, ఫిజిక్స్ సబ్జెక్టుల‌‌తో ఇంట‌‌ర్మీడియ‌‌ట్ ఉత్తీర్ణత‌‌. వ‌‌య‌‌సు: 18 నుంచి 22 ఏండ్ల మధ్య ఉండాలి.

2) నావిక్ (డొమెస్టిక్ బ్రాంచ్‌‌): గుర్తింపు పొందిన ఎడ్యుకేష‌‌న్ బోర్డుల నుంచి ప‌‌దో త‌‌ర‌‌గ‌‌తి ఉత్తీర్ణత‌‌. వ‌‌యసు: 18 నుంచి 22 ఏళ్ల మ‌‌ధ్య ఉండాలి. 

3) యాంత్రిక్‌‌: గుర్తింపు పొందిన ఎడ్యుకేష‌‌న్ బోర్డుల నుండి ప‌‌దో త‌‌ర‌‌గ‌‌తి ఉత్తీర్ణతతో పాటు డిప్లొమా ఉత్తీర్ణత‌‌. సెలెక్షన్ ప్రాసెస్: నాలుగు దశల్లో చూపిన ప్రతిభ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. రాతపరీక్ష, ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. 

ద‌‌ర‌‌ఖాస్తులు: ఆన్‌‌లైన్​. అప్లికేషన్స్ ప్రారంభం: 4 జనవరి 2022. చివ‌‌రి తేది: 14 జనవరి 2022

వెబ్​సైట్: joinindiancoastguard.cdac.in