అమోరికాలో అసలు ఏం జరుగుతోంది ? ఇండియన్ స్టూడెంట్స్ ని ఎందుకిలా చంపుతున్నారు?

అమోరికాలో అసలు ఏం జరుగుతోంది ? ఇండియన్ స్టూడెంట్స్ ని ఎందుకిలా చంపుతున్నారు?

గత రెండు నెలల్లోనే అమెరికాలో దాదాపు నలుగురు ఇండియన్ స్టూడెంట్స్ వివిధ చోట్ల చంపబడ్డారు. మంగళవారం సెయింట్ టూయిస్ లో కలకత్తాకు చెందిన ఓ డ్యాన్సర్ ని గుర్తు తెలియని దుండగులు కాల్చి  చంపారు. క్లాసికల్ డ్యాన్సర్ అయిన అమిత్ ఘోష్  మిస్సౌరీలోని సెయింట్ లూయిస్ లో పీహెచ్డీ చదువుతున్నాడు. హైయిర్ ఎడ్యూకెషన్ కోసం వెళ్లిన భారతీయ విద్యార్థులపై తరచూ దాడులు జరుగుతున్నాయి. సంవత్సరానికి పదుల సంఖ్యలో కన్నవాళ్ల ఆఖరి చూపుకు కూడా నోచుకోకుండా స్టూడెంట్స్ హత్యలకు గురవుతున్నారు. ఈ దాడుల్లో అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. దీంతో USలో చదువుతున్న లక్షలాది విద్యార్థుల తల్లిదండ్రులు భయాంధోళనకు గురవుతున్నారు. 

ఫిబ్రవరి 26న సెయింట్ లూయిస్ కాంపస్ దగ్గర వాకింగ్ చేస్తుండగా కొందరు వ్యక్తులు వచ్చి గన్ తో కాల్చి ఘోష్ ని  చంపారని ఇండియాలోని అతని ఫ్రెండ్ దేవోలీనా భట్టాచార్జీ తెలిపారు. మృతుడికి తల్లిదండ్రులు ఇద్దరూ లేరని, ఈ ఘటనపై చర్య తీసుకోవాలని ఆమె భారత విదేశాంగ మంత్రిని కోరింది. ఈ వార్త దేవోలీనాను  చాలా బాధపెట్టిందని ఆవేదన వ్యక్తం చేసింది. దీనిపై చికాగోలోని భారత్ కాన్సులేట్ చాలా సీరియస్ గా స్పందించింది. సెయింట్ లూయిస్ పోలీసులకు విచారణ చేపట్టాలని ఆదేశించింది. యూనివర్సిటీ వివరణ వివ్వాలని కోరింది. చికాగో కాన్సులేట్ ఘోష్ మృతి పట్ల సంతాపం తెలిపింది.