కరోనాపై ఇండియన్ డాక్టర్ల ముందడుగు

కరోనాపై ఇండియన్ డాక్టర్ల ముందడుగు

కరోనా వైరస్ గుట్టు తేలుస్తం !
చైనా వైరస్​పై పరిశోధనకు సీసీఎంబీ రెడీ
జీనోమ్ స్టడీతోనే వైరస్ పుట్టుపూర్వోత్తరాలు తెలుస్తయి
ఇందుకోసమే వైరస్‌ను వేరు (ఐసోలేట్) చేసిన ఐసీఎంఆర్

సికింద్రాబాద్/ న్యూఢిల్లీ, వెలుగు: ప్రపంచానికి మహమ్మారిలా మారిన కొత్త కరోనా వైరస్ పుట్టుకను తేల్చేందుకు హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) సైంటిస్టులు రెడీ అయ్యారు. ఈ వైరస్ జీనోమ్‌ను స్టడీ చేయడం ద్వారా ఇది చైనాలోనే పుట్టిందా? లేక మరే దేశంలోనైనా పుట్టిందా? ఎలాంటి మార్పులు చెందుతూ వస్తోంది? అన్నది గుర్తించేందుకు వారు సిద్ధమయ్యారు. కరోనా పుట్టుక, దానిలో కలుగుతున్న మార్పులు, మనదేశంలోని ఇతర వైరస్‌లకు దానికి ఏమైనా పోలికలు ఉన్నాయా? అనే అంశాలపైనా సైంటిస్టులు ఫోకస్ పెట్టనున్నారు. కరోనా వైరస్ శాంపిల్‌ను ఐసీఎంఆర్ సైంటిస్టులు వేరు చేసిన నేపథ్యంలో, ఆ సంస్థ నుంచి శాంపిల్ సేకరించి, కరోనా వైరస్ జీనోమ్‌పై రీసెర్చ్ చేయాలని భావిస్తున్నారు.

ఆందోళన అవసరంలేదు
కరోనావైరస్ వ్యాప్తి గురించి సీసీఎంబీ డైరెక్టర్ డాక్టర్ రాకేశ్ మిశ్రా మాట్లాడుతూ.. వేడి ఎక్కువుంటే కరోనావైరస్ వ్యాప్తి చెందదనడానికి ఎలాంటి సైంటిఫిక్ ఎవిడెన్స్ లేదన్నారు. వైరస్ జీనోమ్‌పై రీసెర్చ్ ద్వారానే పూర్తి విషయాలు తెలుస్తాయని స్పష్టం చేశారు. అలాగే నాన్ వెజ్‌తో ఈ వైరస్ వ్యాపిస్తుందని చెప్పేందుకూ ఎలాంటి ఆధారాలు లేవన్నారు. ప్రస్తుతం కొవిడ్–19పై అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ‘‘జనం ఎక్కువగా గుమిగూడే మీటింగ్‌లు, ఫంక్షన్ల వంటివాటికి వెళ్లొద్దు. వృద్ధులు, పేషెంట్లు జాగ్రత్తగా ఉండాలి. ఇంట్లో పిల్లల నుంచి పెద్దల వరకూ అందరూ చేతులను శానిటైజర్లతో కడుక్కోవాలి. షాపింగ్ మాల్స్ వంటి ప్రదేశాలకు వెళ్తే తలుపులు, కిటికీలు, ఐరన్ రెయిలింగు‌లను తాకకుండా జాగ్రత్త పాటించాలి. దగ్గు, జలుబు ఉన్నవారికి కొంచెం దూరంగా ఉండాలి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే చాలు.. కరోనా వైరస్ వ్యాపించకుండా అడ్డుకోవచ్చు” అని ఆయన వివరించారు.

కరోనా వైరస్‌ను వేరు చేసిన్రు

ఇప్పటివరకూ చైనా, జపాన్, థాయిలాండ్, అమెరికా దేశాలు మాత్రమే కరోనావైరస్‌ను శాంపిల్ నుంచి ఐసోలేట్ (వేరు) చేయగా, తాజాగా ఇండియన్ కౌన్సి ల్ ఆఫ్ మెడి కల్ రీసె ర్చ్ (ఐసీఎంఆర్) సైంటిస్టులూ దీనిని వేరు చేయగలిగారు. మనిషి శరీరానికి వెలుపల వైరస్ ప్యూ ర్ శాంపిల్‌ను వీరు సేకరించగలిగారు. ‘‘పలువురు పేషెంట్ల గొంతు, ముక్కు నుంచి సేకరించిన 21 శాంపిళ్లను పరిశీలించగా, 11 పాజిటివ్‌గా వచ్చాయి . వీటిలో 8 శాంపిళ్ల నుంచి వైరస్ స్ట్రెయిన్స్‌ను వేరు చేశాం . ఇవి చైనాలోని వుహాన్‌లో మొదలైన కరోనావైరస్ తో 99.98% సరిపోలాయి” అని ఐసీఎంఆర్ చీఫ్ ఎపిడెమియాలజిస్ట్ డాక్టర్ ఆర్.ఆర్. గంగాఖేద్కర్ వెల్లడించారు. ‘‘ప్రస్తుతం ఈ వైరస్‌కు టీకాలు గానీ ప్రత్యేకంగా మందులు గానీ లేవు. కేవలం దీని లక్షణాలను తగ్గించేందుకు మాత్రమే ఆయా మందులు వాడుతున్నారు. మన దేశంలో కొందరికి హెచ్ఐవీ మందులు వాడగా, కొన్ని దేశాల్లో ఎబోలా మందులు
కూడా వాడుతున్నారు. కానీ ఇవి ఎంతమేరకు పని చేస్తాయన్నది చెప్పలేం. అందుకే.. కరోనా వైరస్ బయాలజీని తెలుసుకోవాలంటే దానిని ఐసోలేట్ చేయడం అవసరం. అప్పుడే ఈ వైరస్‌ను పూర్తిగా స్టడీ చేసి, నిర్మూలించడానికి పనికొచ్చే మందులను తయారు చేసేందుకు వీలవుతుంది” అని ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ బలరామ్ భార్గవ వివరిం చారు.

For More News..

గుజరాత్‌‌లో కాంగ్రెస్‌‌కు షాక్‌.. నలుగురు ఎమ్మెల్యేలు రాజీనామా

మే నుంచి కరెంట్ బిల్లుల పెంపు.. మధ్య తరగతిపై భారం

గుడ్‌న్యూస్.. కరోనా టెస్టులు ఫ్రీ

కట్నం కోసం కరోనా వేధింపులు